iDreamPost
android-app
ios-app

ఇయర్ బర్డ్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే డేంజర్ లో పడినట్లే

  • Published Sep 26, 2024 | 8:38 AM Updated Updated Sep 26, 2024 | 8:38 AM

నిత్యం మార్కెట్ లో ఎన్నో రకాల ఇయ‌ర్ బ‌డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాటిని కొనుగోలు చేసినప్పుడు బెస్ట్ ఇయ‌ర్ బ‌డ్స్, బ్రాండెండ్ కంపెనీ ఇవన్నీ చూసే కొంటూంటాం. కానీ, కొన్నిసార్లు ఆ బ్రాండెండ్ వస్తువుల్లో కూడా ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా  తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. తాజాగా ఓ యువతి బ్రాడెండ్ ఇయర్ బడ్స్ ను చెవిలో పెట్టి వినియోగిస్తుండగా.. ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. 

నిత్యం మార్కెట్ లో ఎన్నో రకాల ఇయ‌ర్ బ‌డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాటిని కొనుగోలు చేసినప్పుడు బెస్ట్ ఇయ‌ర్ బ‌డ్స్, బ్రాండెండ్ కంపెనీ ఇవన్నీ చూసే కొంటూంటాం. కానీ, కొన్నిసార్లు ఆ బ్రాండెండ్ వస్తువుల్లో కూడా ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా  తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. తాజాగా ఓ యువతి బ్రాడెండ్ ఇయర్ బడ్స్ ను చెవిలో పెట్టి వినియోగిస్తుండగా.. ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. 

  • Published Sep 26, 2024 | 8:38 AMUpdated Sep 26, 2024 | 8:38 AM
ఇయర్ బర్డ్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే డేంజర్ లో పడినట్లే

ఈరోజుల్లో బ్లూటూత్, హెడ్ ఫోన్,ఇయర్‌బడ్స్‌ వంటివి వినియోగించని వారంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరి చెవిలో తరుచు ఇవి దర్శనమిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే.. మొబైల్ లో ఓ సినిమా చూడలన్నా, సాంగ్స్ వినాలన్న, చివరికి గేమ్స్ ఆడాలన్న సరే ఇయర్ బడ్స్ ను కచ్చితంగా ఉండాల్సిందే.  ఇక వాటిని పెట్టుకుంటే.. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అసలు ఈ లోకంతోనే సంబంధం లేకుండా ఫోన్ లో లీనమైపోతారు. నిజానికి ఎక్కడికైనా ట్రావలింగ్ కు వెళ్లినా, వాకింగ్ వెళ్లినా సరే.. ఈ ఇయర్ బర్డ్ అనేవి లేకపోతే ఏదో వెలుతులా భావిస్తుంటారు. ఈ రకంగా ఈయర్ బడ్స్ వినియోగించే వారి సంఖ్య ఎక్కువనే చెప్పవచ్చు. అందుకే మార్కెట్ కూడా వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.

నిత్యం మార్కెట్ లో ఎన్నో రకాల ఇయ‌ర్ బ‌డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాటిని కొనుగోలు చేసినప్పుడు బెస్ట్ ఇయ‌ర్ బ‌డ్స్, బ్రాండెండ్ కంపెనీ ఇవన్నీ చూసే కొంటూంటాం. మరి కొన్ని సందర్భాల్లో ఆఫర్స్ లో తక్కువ ధరకు వస్తుందని కొనేస్తూంటాం. కానీ, ఎంతో బ్రాండెండ్ వస్తువులైనా వాటిలో ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. బెస్ట్ కంపెనీ ఇయర్ బడ్స్ కదా అని ఎక్కువగా వినియోగిస్తే కోరి ప్రమాదని తెచ్చుకున్నట్లవుతుంది. అందుకు ఉదాహరణగా  తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.  ఇటీవలే  ఓ యువతి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో.. ఊహించని విధంగా అది చెవిలో పేలింది. దీంతో ఆ యువతి శాశ్వతంగా ఆ సమస్యతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. అయితే ఈ భయంకరమైన ఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ యువతి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో.. అది ఊహించని విధంగా చెవిలో ఒక్కసారిగా పేలిందని ఆ యువతి ప్రియుడు తెలిపాడు. పైగా ఈ విషయం పై శాంసంగ్ సంస్థకు ఫిర్యాదు చేశామని, అయిన ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. పేలుడుకు గల కారణాన్ని కూడా వెల్లడించలేదని చెప్పారు. కానీ, ఈ శాంసంగ్ ఇయర్ బడ్స్ లో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వారి తెలిపారు.

కనుక ఎవరైనా ఇయర్ బడ్స్ ను ఎక్కువగా వినియోగించినట్లయితే.. నాణ్యత లేని తక్కువ ధరకు వచ్చే ఇయర్ బడ్స్ ని వినియోగించడం ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా సేఫ్టీ లేని ఇయర్ బడ్స్ ను వినియోగిస్తే.. ప్రమాదంలో పడినట్లే అవుతుంది. ఎందుకంటే.. ఇవి చెవిలో పేలుతయనే కాదు.. వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ఇయర్ బడ్స్ ఎక్కువగా వినియోగిస్తే.. అవి విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కూడా ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని చాలా పరిశోధన వెల్లడైంది. పైగా దీని వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని పలువరు వైద్య నిపుణులు వెల్లడించారు. అందుకే ఇయర్ బడ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నా వారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సేఫ్టీ లోపం, నాణ్యత లేని ఇయర్ బడ్స్ ను వాడటం ప్రాణానికే ప్రమాదం అని గుర్తించుకోవాలి. మరి, శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలి ఓ యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.