iDreamPost
android-app
ios-app

భార్య బికినీ వేసుకోవాలని.. ఏకంగా ఐలాండ్ కొన్నాడు.. ఎన్ని కోట్లు తెలుసా?

  • Published Sep 26, 2024 | 11:51 AM Updated Updated Sep 26, 2024 | 11:51 AM

Millionaire Buy a Private Island for His Wife: ప్రపంచంలో వివాహ బంధం ఎంతో గొప్పగా భావిస్తుంటారు. వారి వారి సంప్రదాయాల్లో పెద్దల సమక్షంలో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. ఓ భార్య కోసం భర్త చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Millionaire Buy a Private Island for His Wife: ప్రపంచంలో వివాహ బంధం ఎంతో గొప్పగా భావిస్తుంటారు. వారి వారి సంప్రదాయాల్లో పెద్దల సమక్షంలో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. ఓ భార్య కోసం భర్త చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  • Published Sep 26, 2024 | 11:51 AMUpdated Sep 26, 2024 | 11:51 AM
భార్య బికినీ వేసుకోవాలని.. ఏకంగా ఐలాండ్ కొన్నాడు.. ఎన్ని కోట్లు తెలుసా?

ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చాలా వరకు  ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఆదిపత్య పోరు, అనారోగ్య సమస్యలు,  వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల దంపతుల మద్య గొడవలు జరిగి విడిపోతున్నారు. కానీ, కొంతమంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. ఒకరంటే ఒకరు ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ అవుతుంటారు. ఓ భర్త భార్య సంతోషం కోసం వందల కొట్లు ఖర్చు పెట్టి  ఓ ఐలాండ్ కొన్నాడు. ఇంతకీ ఆయన అన్ని కోట్లు వెచ్చింది ఐలాండ్ ఎందుకు కొన్నాడో తెలిస్తే ఔరా అని ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా భార్య సంతోష పెట్టడానికి భర్తలు తమ స్థాయి కొద్ది బహుమతులు ఇస్తుంటారు.చీరలు, నగలు కొని సంతోషపెడతారు. కానీ ఓ మిలీనియర్ మాత్రం భార్య ఆనందం కోసం ఏకంగా ఐలాండ్ కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకొని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో.. ఐలాండ్ కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదాక్ కోసం హిందూ మహాసముద్రంలోని ఓ ఐలాండ్ కొనుగోలు చేశారు. దాని కోసం ఆయన ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.418 కోట్లు).ఈ విషయాన్ని ఆయన భార్య సౌదీ అల్ సదాక్ ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. అంతేకాదు ఆ ఐలాండ్ వీడియో షేర్ చేసింది.

‘ నేను బికినీ వేసుకొని బయట తిరగాలంటే ఇబ్బందిగా ఉందని నా భర్త ఏకంగా ఓ ఐలాండ్ కొనుగోలు చేశారు’ అని ఆమె రాసుకొచ్చారు. ‘దీర్ఘకాల పెట్టుబడి గురించి మేమిద్దరం ఆలోచించాం.. ఆ సమయంలో కాస్త గోప్యతపై దృష్టి సారించాం.. నేను బీచ్ లో సురక్షితంగా సేద తీరాలనేది నా భర్త కోరిక. అందుకే నా సంతోషం కోసం ఆ ఐలాండ్ ని సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది’ అంటూ ఇన్ స్ట్రాలో రాసుకొచ్చింది. ఆ ద్వీపం ఆసియా ఖండంలోనిదే అని చెప్పింది. కాకపోతే దాని గురించి పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఆమె చెప్పిన విషయంపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఎంత మిలీనియర్ అయితే మాత్రం బికినీ కోసం అంత ఐలాండ్ కొంటాడా? అని ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Soudi✨ (@soudiofarabia)