iDreamPost
android-app
ios-app

Devara Movie: దేవర ప్రభంజనం! మరో సెన్సేషనల్ రికార్డ్..

  • Published Sep 25, 2024 | 9:48 PM Updated Updated Sep 25, 2024 | 9:52 PM

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' లాంటి ఇండస్ట్రి హిట్ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకొని 'దేవర' సినిమాతో రాబోతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' లాంటి ఇండస్ట్రి హిట్ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకొని 'దేవర' సినిమాతో రాబోతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.

  • Published Sep 25, 2024 | 9:48 PMUpdated Sep 25, 2024 | 9:52 PM
Devara Movie: దేవర ప్రభంజనం! మరో సెన్సేషనల్ రికార్డ్..

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఇండస్ట్రి హిట్ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకొని ఎన్టీఆర్ కొరటాల సినిమా ఒకే చేశారు. ప్రస్తుతం తారక్ ఆయన దర్శకత్వంలో ‘దేవర’ సినిమాతో రాబోతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందే రికార్డులు నమోదు చేస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర క్రేజ్ మాములుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావడం వలన అన్ని ఏరియాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. USAలో కూడా ప్రీ సేల్స్ లో రోజుకో రికార్డుని నమోదు చేస్తుంది. నార్త్‌ అమెరికాలో ‘దేవర’ ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అలవోకగా దాటేసింది.

తాజాగా మరో సెన్సేషనల్ రికార్డుని నమోదు చేసింది. ఈ సినిమాకి అడ్వాన్స్‌ బుకింగ్స్ ద్వారా ఏకంగా 21 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదయ్యయ్యయి. అంటే దాదాపు 4 లక్షల 95 వేల టిక్కెట్లు ఈ సినిమాకి బుక్ అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే తాజాగా ఇంకో అదిరిపోయే రికార్డుని సృష్టించింది. ఈ సినిమాకి యూఎస్ఏ ప్రీమియర్ సేల్స్ లో ఏకంగా 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని మూవీ టీం తెలియజేసింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ రికార్డుతో దేవర రికార్డుల ఊచకోత కోయడం ఖాయం అంటున్నారు అభిమానులు. దాంతో మొదటి రోజు కచ్చితంగా దేవర సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టబోతుందని అర్ధమవుతుంది. చూడాలి ఈ సినిమా విడుదల అయ్యాకా ఇంకెన్నికొత్త రికార్డులు నమోదు చేస్తుందో..

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఫిమేల్ లీడ్ లో నటించింది. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఇంకా సీనియర్ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పాట ఆకట్టుకుంది. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక విడుదలకు ముందే దేవర సృష్టించిన తాజా రికార్డుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss