iDreamPost
android-app
ios-app

వీడియో: హోటల్ స్టాఫ్​పై కోహ్లీ సీరియస్! రెండు చేతులే ఉన్నాయంటూ..

  • Published Sep 25, 2024 | 5:49 PM Updated Updated Sep 25, 2024 | 5:49 PM

Virat Kohli, IND vs BAN: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ కామ్​గా, కూల్​గా ఉంటాడు. తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటాడు. అలాంటోడు చాన్నాళ్ల తర్వాత కాస్త సీరియస్ మోడ్​లో కనిపించాడు.

Virat Kohli, IND vs BAN: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ కామ్​గా, కూల్​గా ఉంటాడు. తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటాడు. అలాంటోడు చాన్నాళ్ల తర్వాత కాస్త సీరియస్ మోడ్​లో కనిపించాడు.

  • Published Sep 25, 2024 | 5:49 PMUpdated Sep 25, 2024 | 5:49 PM
వీడియో: హోటల్ స్టాఫ్​పై కోహ్లీ సీరియస్! రెండు చేతులే ఉన్నాయంటూ..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ కామ్​గా, కూల్​గా ఉంటాడు. తాను నవ్వుతూ తన చుట్టూ ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఉంటాడు. గ్రౌండ్​లో కంటే బయట ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందరితో ఈజీగా కలసిపోతాడు. డ్రెస్సింగ్ రూమ్​లో కూడా సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే ఎప్పుడు చూసినా అతడి చుట్టూ యంగ్ ప్లేయర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు క్రికెట్​కు సంబంధించిన టిప్స్ చెబుతూ తన వంతు సాయం చేస్తుంటాడు కింగ్. గ్రౌండ్​లో ప్రత్యర్థి జట్లతో అగ్రెసివ్​గా ఉన్నా టీమ్​మేట్స్​తో పాటు అభిమానులతో ఫ్రెండ్లీ అప్రోచ్​తో ముందుకెళ్తున్నాడు కోహ్లీ. అలాంటోడు హోటల్ స్టాఫ్​ మీద ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. కూల్​గా ఉండే విరాట్ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో ఇప్పుడు చూద్దాం..

బంగ్లాదేశ్​తో సిరీస్​లో భాగంగా రెండో టెస్ట్ కోసం కాన్పూర్​కు చేరుకున్నారు టీమిండియా క్రికెటర్లు. వాళ్లకు ఎయిర్​పోర్ట్​తో పాటు హోటల్​లోనూ గ్రాండ్ వెల్​కమ్ లభించింది. రిషబ్ పంత్​తో కలసి హోటల్​కు చేరుకున్న కోహ్లీకి అక్కడి స్టాఫ్ ఘనస్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్ది, ఫ్లవర్ బొకేలు ఇచ్చి హోటల్​లోకి ఆహ్వానించారు. అయితే స్టాఫ్​ అంతా ఒకేసారి కోహ్లీకి షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. దీంతో విరాట్ సీరియస్ అయ్యాడు. తనకు రెండు చేతులే ఉన్నాయని అన్నాడు. ఎంతమందికి షేక్ హ్యాండ్స్ ఇవ్వను అంటూ సీరియస్​గా మాట్లాడాడు. కొందరు చేతులు కలపడానికి ప్రయత్నించగా వాళ్లను వారించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కోహ్లీ కోపంగా వెళ్లిపోవడంతో హోటల్ స్టాఫ్​ షాక్ అయ్యారు. విరాట్​తో పాటే హోటల్​కు వచ్చిన రిషబ్ పంత్ మాత్రం అక్కడి సిబ్బందితో కూల్​గా మాట్లాడాడు. వాళ్లకు షేక్​హ్యాండ్స్ ఇచ్చాడు. వాళ్లతో కలసి ఫొటోలు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ తప్పేమీ లేదని, ఒకేసారి అంత మంది చేతులు కలిపితే అతడు మాత్రం ఏం చేస్తాడని అంటున్నారు. ఇక, చెన్నై టెస్ట్​లో విఫలమయ్యాడు విరాట్. మొదటి ఇన్నింగ్స్​లో 6 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్​లో 17 పరుగులు చేసి అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో కాన్పూర్ టెస్ట్​లో తన ప్రతాపం చూపించాలని అనుకుంటున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే స్పిన్​ ఆడటంలో ఇబ్బంది పడే కింగ్.. టర్న్​కు అనుకూలిస్తుందని చెబుతున్న ఇక్కడి బ్లాక్ సాయిల్ పిచ్​పై ఎలా ఆడతాడో చూడాలి. మరి.. హోటల్ స్టాఫ్​ మీద కోహ్లీ సీరియస్ అవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.