Nidhan
ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2024లో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో జోష్ మీద ఉంది హార్దిక్ సేన.
ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2024లో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో జోష్ మీద ఉంది హార్దిక్ సేన.
Nidhan
ఐపీఎల్-2024 మొదలవడానికి ముందు ఫేవరెట్స్‌లో ఒకటిగా ముంబై ఇండియన్స్ నిలిచింది. స్టార్లతో నిండిన ఈ టీమ్ ఈసారి ట్రోఫీ రేసులో ముందంజలో కనిపించింది. కానీ టోర్నీ ప్రారంభం తర్వాత హ్యాట్రిక్ ఓటములతో అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది ఎంఐ. దీంతో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ టీమ్ పనైపోయిందని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఓటముల నుంచి కోలుకున్న ఎంఐ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎట్టకేలకు టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్‌లో ఉన్న ముంబై.. ఇప్పుడు 9వ స్థానానికి చేరుకుంది. డీసీపై గెలుపు తర్వాత ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ సీజన్లో ముంబై ఫస్ట్ విక్టరీ కొట్టడంపై రోహిత్ రియాక్ట్ అయ్యాడు. తన ఆట లెక్కలోకి రాదన్నాడు. ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ల కంటే టీమ్ గెలుపే ముఖ్యమని చెప్పాడు. ‘మా బ్యాటింగ్ యూనిట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. సీజన్లో తొలి మ్యాచ్ నుంచి దీని కోసమే ప్రయత్నిస్తూ వచ్చాం. వ్యక్తిగత ప్రదర్శనలు లెక్కలోకి రావు. వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. టీమ్ గెలుపు అన్నింటి కంటే ముఖ్యం. బ్యాటర్లు కలసికట్టుగా రాణిస్తేనే భారీ స్కోర్లు నమోదు చేయగలం. బ్యాటింగ్ కోచ్‌తో పాటు కెప్టెన్ కూడా ఇదే అందరి నుంచి ఆశిస్తున్నది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక, ఢిల్లీతో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించని రోహిత్.. ఆ కసిని డీసీ మీద చూపించాడు.
ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు హిట్‌మ్యాన్. 27 బంతులు ఎదుర్కొన్న అతడు 49 పరుగులు చేశాడు. కొంచెంలో హాఫ్ సెంచరీ మిస్సయిన రోహిత్.. ఉన్నంత సేపు ప్రత్యర్థి జట్టును ఆటాడుకున్నాడు. 6 బౌండరీలు కొట్టిన అతడు.. 3 భారీ సిక్సులు బాదాడు. అతడికి తోడు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42) రాణించడంతో ముంబై ఆరున్నర ఓవర్లలోనే 80 పరుగులు చేసింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45), రొమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 39) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 20 ఓవర్లు ముగిసేసరికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన డీసీ.. ఓవర్లన్నీ ఆడి 205 పరుగులే చేయగలిగింది. బ్యాటర్లు రాణించడంతోనే ఎంఐ నెగ్గింది. అందుకే తన ఒక్కడి ఆట లెక్కలోకి రాదన్నాడు రోహిత్. ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ల కంటే టీమ్ గెలుపే ముఖ్యమని చెప్పాడు. మరి.. జట్టు విజయమే ముఖ్యమంటూ హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న లక్నోకు ఊహించని షాక్.. ఇక నెగ్గడం కష్టమే!
Rohit Sharma said – “Individual performance doesn’t matter if the whole team stands up and put their hands up and take a look at the team’s goal”. (MI TV). pic.twitter.com/YTubJ6WdHu
— CricketMAN2 (@ImTanujSingh) April 8, 2024