iDreamPost

LSG vs GT: లక్నో vs గుజరాత్.. గెలిచేదెవరంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ పోరు జరగోబోతోంది. లక్నో-గుజరాత్ మధ్య ఈ ఫైట్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది? పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ పోరు జరగోబోతోంది. లక్నో-గుజరాత్ మధ్య ఈ ఫైట్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది? పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం పదండి.

LSG vs GT: లక్నో vs గుజరాత్.. గెలిచేదెవరంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఐపీఎల్ 2024 సీజన్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక హాలీడే ఆదివారం రోజున మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఢీ కొంటోంది గుజరాత్ టైటాన్స్. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 200 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడంలో విఫలమైంది గుజరాత్ టీమ్. ఇటు లక్నో ఆర్సీబీని ఓడించి మంచి ఊపులో ఉంది. మరి నిలకడగా రాణిస్తున్న ఈ రెండు జట్లలో గెలుపు ఎవరిని వరిస్తుందో ఓసారి పరిశీలిద్దాం పదండి.

లక్నో సూపర్ జెయింట్స్

ఈ సీజన్ లో లక్నో నిలకడైన ఫామ్ ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్ లో ఉంది. చివరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఓడించి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది. జట్టులో ఓపెనర్ డికాక్ గత మ్యాచ్ ద్వారా టచ్ లోకి వచ్చాడు. పూరన్ సైతం మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పారించిన దేవ్ దత్ పడిక్కల్ తన బ్యాట్ కు ఇంకా పని చెప్పలేదు. మిగతా వారిలో స్టోయినిస్, కృనాల్ పాండ్యా రాణించాల్సి ఉంది. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. మెరుపు బౌలర్ మయాంక్ యాదవ్ లక్నోకు కీలకంగా మారాడు. బుల్లెట్స్ కంటే వేగంతో బంతులు సంధిస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇతడితో పాటుగా నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్

ఈ సీజన్ లో పడుతూ.. లేస్తూ.. తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది గుజరాత్ టీమ్. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. చివరిగా ఆడిన మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. 200 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది గుజరాత్ టీమ్. ఇక జట్టులో కెప్టెన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటు సారథిగా, అటు బ్యాటర్ గా రాణిస్తున్నాడు. మిగతా వారిలో వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్ బాగానే ఆడుతున్నప్పటికీ.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమౌతున్నారు. డేవిడ్ మిల్లర్ ఇంకా టచ్ లోకి రాలేదు, కేన్ విలియమ్సన్ చివరి మ్యాచ్ లో నిరాశపరిచాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. మోహిత్ శర్మ కీలకంగా మారాడు. అతడికి తోడు ఒమర్ జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ మరింతగా రాణించాల్సి ఉంది.

ప్రిడిక్షన్

రెండు టీమ్స్ పటిష్టంగా ఉన్నాయి. టఫ్ కాంపిటీషన్ తప్పదు. కానీ బలాబలాలను బట్టి ఈ మ్యాచ్​లో గుజరాత్​ గెలవడం పక్కా. అయితే లక్నో నుంచి గట్టి పోటీ మాత్రం తప్పేలా లేదు. గుజరాత్ టీమ్ లో బ్యాటింగ్ డెప్త్, బౌలింగ్​లో ఎక్కువ రిసోర్సెస్ ఉండటం, గత మ్యాచ్​లో ఓడిపోయారు కాబట్టి కసి మీద ఉండటం వల్ల ఈ మ్యాచ్​లో జీటీ విజయం సాధిస్తుందనిపిస్తోంది. మరి గుజరాత్ వర్సెస్ లక్నో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్(అంచనా)

డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దేవ్ దత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, సిద్దార్థ్

గుజరాత్ టైటాన్స్ టీమ్(అంచనా)

వృద్ధిమాన్ సాహా, శుబ్ మన్ గిల్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, ఒమర్ జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి