iDreamPost

KL Rahul: చెన్నైపై విజయం.. ఫ్యాన్స్ పై ఊహించని కామెంట్స్ చేసిన రాహుల్!

చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఈ మ్యాచ్ తర్వాత చెన్నై ఫ్యాన్స్ పై ఊహించని కామెంట్స్ చేశాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.

చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఈ మ్యాచ్ తర్వాత చెన్నై ఫ్యాన్స్ పై ఊహించని కామెంట్స్ చేశాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.

KL Rahul: చెన్నైపై విజయం.. ఫ్యాన్స్ పై ఊహించని కామెంట్స్ చేసిన రాహుల్!

లక్నో సూపర్ జెయింట్స్.. ఈ ఐపీఎల్ సీజన్ లో నిలకడగా రాణిస్తూ విజయాలు సాధిస్తున్న టీమ్. వరుసగా రెండు ఓటముల తర్వాత గొప్పగా పుంజుకున్న లక్నో, పటిష్టమైన చెన్నై టీమ్ ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. లక్ష్యం చిన్నది కానప్పటికీ.. ఎలాంటి తడబాటు లేకుండా టార్గెట్ ను రీచ్ అయ్యింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించారు. ఇక మ్యాచ్ అనంతరం లక్నో సారథి రాహుల్ చెన్నైపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 19)న లక్నో-చెన్నైల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది లక్నో. దీంతో 8 వికెట్ల తేడాతో చెన్నై టీమ్ ను చిత్తు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జట్టులో రవీంద్ర జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సుతో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. రహానే(36), మెుయిన్ అలీ(30), ధోని (28*) పరుగులతో రాణించారు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు.

అనంతరం 177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్లు కెప్టెన్ రాహుల్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 82 రన్స్, క్వింటన్ డికాక్ 54 పరుగులతో తొలి వికెట్ కు 134 పరుగులు జోడించి.. విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి లక్నో 19 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెన్నై ఫ్యాన్స్ గురించి ఊహించని కామెంట్స్ చేశాడు. “చెన్నై ప్రేక్షకులు మాకోసం గ్రౌండ్ లో అరుస్తారని, మమ్మల్ని ఉత్సాహపరుస్తారని నేను అనుకోను. మా ప్లేయర్లకు కూడా అదే చెప్పాను. పైగా వారి అరుపులకు అలవాటు పడాలని చెప్పాను. ఎందుకంటే? మళ్లీ మరికొన్ని రోజుల్లో మనం ఈ పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ధోని గ్రౌండ్ లో నడుస్తుంటే.. ప్రేక్షకులు గట్టిగా అరుస్తుంటే బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మా ప్లేయర్లు గొప్పగా రాణించారు” అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్. ఇక ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో 7 మ్యాచ్ ల్లో 4 విజయాలతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి