iDreamPost

అందర్నీ భయపెట్టే బ్రెట్ లీని ఒకడు ఉ*చ్చ పోయించాడని తెలుసా? వాడి పేరు?

  • Published Apr 20, 2024 | 7:21 AMUpdated Apr 20, 2024 | 7:21 AM

వరల్డ్ క్రికెట్​లో అత్యంత ప్రమాదకర బౌలర్లలో బ్రెట్​లీ ఒకడు. బుల్లెట్ వేగంతో అతడు వేసే పేస్​ డెలివరీస్​ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్​కైనా కష్టమే. బ్రెట్​ లీని ఎదుర్కోలేక మహామహా క్రికెటర్లే చేష్టలుడిగారు. కానీ అతడికి ఓ కుర్రాడు పోయించాడని తెలుసా?

వరల్డ్ క్రికెట్​లో అత్యంత ప్రమాదకర బౌలర్లలో బ్రెట్​లీ ఒకడు. బుల్లెట్ వేగంతో అతడు వేసే పేస్​ డెలివరీస్​ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్​కైనా కష్టమే. బ్రెట్​ లీని ఎదుర్కోలేక మహామహా క్రికెటర్లే చేష్టలుడిగారు. కానీ అతడికి ఓ కుర్రాడు పోయించాడని తెలుసా?

  • Published Apr 20, 2024 | 7:21 AMUpdated Apr 20, 2024 | 7:21 AM
అందర్నీ భయపెట్టే బ్రెట్ లీని ఒకడు ఉ*చ్చ పోయించాడని తెలుసా? వాడి పేరు?

బ్రెట్​ లీ.. బౌలర్లకు కార్ఖానా లాంటి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ గొప్ప పేసర్. దాదాపు 13 ఏళ్ల పాటు క్రికెట్ దునియాను ఏలాడీ స్పీడ్​స్టర్. ఒకప్పుడు ఆండీ రాబర్ట్స్, మైకేల్ హోల్టిండ్, జోల్ గార్నర్, మాల్కమ మార్షమ్ వంటి విండీస్ భీకర పేసర్లు బ్యాటర్లను వణికించే వారు. వాళ్ల తర్వాత శకంలో ఆ పనిని బ్రెట్​ లీ తన భుజాన వేసుకున్నాడు. చిరుత లాంటి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి క్రీజులో జంప్ చేసి అతడు వేసే బంతి మెరుపు వేగంతో వచ్చి బ్యాటర్లను కంగుతినిపించేది. బ్రెట్ లీ బౌన్సర్లకు ఎందరో బ్యాటర్లు గాయాలపాలయ్యారు. రన్స్ చేయడం పక్కనబెడితే అతడ్ని డిఫెండ్ చేసేందుకు కూడా అందరూ భయపడేవాళ్లు. అంతగా క్రికెట్​లో డామినేషన్ చూపించిన బ్రెట్ లీని ఓ కుర్రాడు ఉ*చ్చ పోయించాడని మీకు తెలుసా? అతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పాంటింగ్, గిల్​క్రిస్ట్, హేడెన్, మెక్​గ్రాత్, షేన్ వార్న్, సైమండ్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో 2000వ దశకంలో క్రికెట్​ను ఆస్ట్రేలియా ఏలింది. ఆ టైమ్​లో టీమ్​లో మరో లెజెండ్ ఉండేవాడు. అతడే బ్రెట్ లీ. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో బౌన్సర్లు, యార్కర్లు విసురుతూ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించేవాడతను. తోపు బ్యాటర్లు కూడా అతడ్ని ఎదుర్కొని పరుగులు చేయాలంటే భయపడేవారు. తన బౌలింగ్​లో అటాక్​కు దిగితే బౌన్సర్లతో బ్యాటర్లను గాయాలపాలు చేస్తూ వణికించేవాడు బ్రెట్ లీ. అలాంటోడి అహంకారాన్ని అణిచాడో కుర్రాడు. అతడే వెస్టిండీస్ ఏస్ పేసర్ కీమర్ రోచ్.  ఆసీస్-విండీస్​కు మధ్య వన్డే మ్యాచ్​లో బౌన్సర్​తో రోచ్​ను ఇబ్బందికి గురిచేశాడు. బ్రెట్ లీ వేసిన బౌన్సర్ అతడికి తగిలింది. అయితే బ్యాటర్​కు బంతి తగిలాక సారీ చెప్పాల్సిన ఆసీస్ స్పీడ్​స్టర్.. క్షమాపణలు కోరకపోగా రోచ్​ను మరింత రెచ్చగొట్టాడు.

దమ్ముంటే షాట్ కొట్టి చూపించు అంటూ రోచ్​కు బ్రెట్ లీ సవాల్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన విండీస్ పేసర్ ఆ కోపాన్ని, కసిని బౌలింగ్ సమయంలో చూపించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ టైమ్​లో బ్రెట్ లీ బ్యాటింగ్​కు రాగానే బాడీ లెంగ్త్ ఫుల్​టాస్​తో విరుచుకుపడ్డాడు. మెరుపు వేగంతో వచ్చిన ఆ బంతి శరీరం పైకి దూసుకురావడంతో షాకైన బ్రెట్ లీ దాన్ని డిఫెన్స్ చేసేలోపు వచ్చి చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో తల్లడిల్లాడు. బ్యాట్ పడేసి పిచ్​లోనే కూర్చుండిపోయాడు. అప్పుడు రోచ్ వచ్చి అతడ్ని పలకరించాడు. అదే ఓవర్​లో అతడ్ని క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు. ఇది జరిగి చాలా ఏళ్లు అయింది. అయితే క్రికెట్​లోని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్​లో ఒకటైన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. పేస్​తో అందర్నీ భయపెడుతూ అహంకారానికి పోయిన బ్రెట్ లీని రోచ్ ఆడుకున్న తీరు, అతడికి పోయించిన తీరుకు అప్పట్లో అంతా ఫిదా అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి