iDreamPost

Sunil Narine: సునీల్ నరైన్ అరుదైన ఘనత.. ఏకంగా హిట్​మ్యాన్ సరసన చేరిపోయాడు!

  • Published Apr 16, 2024 | 10:09 PMUpdated Apr 16, 2024 | 10:09 PM

కోల్​కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో రోహిత్ శర్మ తర్వాత ఆ ఫీట్​ను అందుకున్న ప్లేయర్​గా నిలిచాడు.

కోల్​కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో రోహిత్ శర్మ తర్వాత ఆ ఫీట్​ను అందుకున్న ప్లేయర్​గా నిలిచాడు నరైన్. రాజస్థాన్ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో మెరుపు శతకంతో అదరగొట్టాడీ కరీబియన్ వీరుడు. 56 బంతుల్లో 109 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 13 బౌండరీలు బాదిన నరైన్.. 6 భారీ సిక్సులు కొట్టాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సులతోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20ల్లో నరైన్​కు ఇది మెయిడిన్ సెంచరీ కావడం విశేషం. ఈ మెరుపు ఇన్నింగ్స్​తో అరుదైన ఘనత అందుకున్నాడతను. ఏకంగా రోహిత్ శర్మ సరసన చేరిపోయాడు.

ఐపీఎల్​ హిస్టరీలో రోహిత్ శర్మ, షేన్ వాట్సన్​కు మాత్రమే సాధ్యమైన ఘతను నరైన్ కూడా అందుకున్నాడు. లీగ్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో పాటు సెంచరీ కూడా కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే ఈ లిస్ట్​లో ఉన్న హిట్​మ్యాన్, వాట్సన్ సరసన చేరిపోయాడు నరైన్. దీంతో అందరూ కోల్​కతా ఓపెనర్​ను మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్ చరిత్రలో గ్రేటెస్ట్ ప్లేయర్లలో అతడు కూడా ఒకడని.. దానికి ఈ రికార్డే నిదర్శనం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రాజస్థాన్​తో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన కేకేఆర్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన సంజూ సేన ప్రస్తుతం 2.1 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 24 పరుగులతో ఉంది. మరి.. నరైన్ అరుదైన ఘనత మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి