Nidhan
కోల్‌కతా నైడ్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఆ టీమ్ హ్యాట్రిక్ విక్టరీస్ వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడు. కేకేఆర్ విజయాలకు, కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కోల్‌కతా నైడ్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఆ టీమ్ హ్యాట్రిక్ విక్టరీస్ వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడు. కేకేఆర్ విజయాలకు, కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్-2024లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తోంది కేకేఆర్. తొలి రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన అయ్యర్ సేన.. మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసి హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. ఆడిన తొలి మూడు మ్యాచుల్లో నెగ్గడం ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో కేకేఆర్‌కు ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, సునీల్ నరైన్ బ్యాటింగ్ విధ్వంసం, ఆండ్రీ రస్సెల్ ఆల్‌రౌండ్ షో, బౌలర్ల సమష్టి కృషి వల్లే కోల్‌కతా అప్రతిహత విజయాలతో దూసుకుపోతోందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆ టీమ్ సక్సెస్ వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడు. అసలు కోల్‌కతాకు కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం..
గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్న లెజెండ్ గౌతం గంభీర్ ఈసారి కోల్‌కతాకు మారాడు. అతడి రాకతో టీమ్ రాతే మారిపోయింది. వరుస విజయాలతో దూకుడు మీద ఉంది కేకేఆర్. సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం సక్సెస్ అయింది. నరైన్ సంచలన ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. మిగతా ఆటగాళ్లలోని టాలెంట్‌ను కూడా బయటకు తీస్తూ కేకేఆర్ విజయాల్లో కీలకంగా మారాడు గౌతీ. అయితే ఆ టీమ్ ఫేట్ పూర్తిగా ఛేంజ్ అవడానికి మాత్రం కోహ్లీనే కారణం. ఐపీఎల్-2023లో ఆర్సీబీ-ఎల్ఎస్జీ మ్యాచ్‌లో విరాట్‌కు గంభీర్‌కు మధ్య గొడవైన సంగతి తెలిసిందే. ఆ టైమ్‌లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు గౌతీ. తన తప్పు లేకపోయినా అవమానించారని అతడు ఫీలయ్యాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీ నుంచి అతడికి సపోర్ట్ లేకుండా పోయింది.
గంభీర్‌కు అండగా నిలవాల్సిన ఎల్ఎస్జీ విరాట్ కోహ్లీని పొగుడుతూ తర్వాత ట్వీట్స్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు గౌతీ. లక్నో ఫ్రాంచైజీలో అతడు ఉండలేకపోయాడు. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి పిలుపు వచ్చింది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమ్‌కు కప్పు అందించిన గౌతీని తిరిగి ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాడు కింగ్ ఖాన్ షారుక్. దీంతో కేకేఆర్‌తో చేరిన గంభీర్.. ఇప్పుడు ఆ కసిని అంతా టీమ్‌లోకి నూరి పోశాడు. ఎవరైతే కోహ్లీ కోసం తనను తిట్టారో వాళ్లంతా ఇప్పుడు గంభీర్‌ను పొగుడుతున్నారు. ఈ విజయాలు అన్నింటికీ కారణం విరాట్ మీద కోపమేనని చెప్పకతప్పదు. ఒక్క గొడవతో గంభీర్ ఎల్ఎస్జీని వీడి కేకేఆర్‌లోకి రావడం, కసితో టీమ్‌ను ముందుకు నడపడం వల్లే ఈ విక్టరీలు సాధ్యం అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: పంత్ కళ్లుచెదిరే సిక్సర్.. బిత్తరపోయిన షారుక్ ఖాన్!
KKR HAS WON FIRST 3 GAMES OF AN IPL SEASON FOR THE FIRST TIME IN HISTORY. 🤯
– Gambhir & Iyer bringing Glory days to KKR. pic.twitter.com/KkZaPoh7i8
— Johns. (@CricCrazyJohns) April 3, 2024