iDreamPost

వీడియో: పంత్ కళ్లుచెదిరే సిక్సర్.. బిత్తరపోయిన షారుక్ ఖాన్​!

  • Published Apr 04, 2024 | 9:01 AMUpdated Apr 04, 2024 | 9:01 AM

రీఎంట్రీలో రిషబ్ పంత్ రెచ్చిపోతున్నాడు. రెండేళ్లు ఆటకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్ ఆ కసిని అంతా బంతి మీద చూపిస్తున్నాడు. బాల్ కనిపించిందే తడవుగా బాదేస్తున్నాడు.

రీఎంట్రీలో రిషబ్ పంత్ రెచ్చిపోతున్నాడు. రెండేళ్లు ఆటకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్ ఆ కసిని అంతా బంతి మీద చూపిస్తున్నాడు. బాల్ కనిపించిందే తడవుగా బాదేస్తున్నాడు.

  • Published Apr 04, 2024 | 9:01 AMUpdated Apr 04, 2024 | 9:01 AM
వీడియో: పంత్ కళ్లుచెదిరే సిక్సర్.. బిత్తరపోయిన షారుక్ ఖాన్​!

ఘోర ప్రమాదం తర్వాత క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు ఆటకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్.. ఆ కసిని అంతా బంతి మీద చూపిస్తున్నాడు. బాల్ కనిపించిందే తడవుగా బాదేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్​ను కెప్టెన్​గా ముందుండి నడిపిస్తున్న పంత్.. బ్యాటింగ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. డీసీ గెలుపోటముల సంగతి పక్కనబెడితే.. ఇప్పుడంతా పంత్ విస్ఫోటనం గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్​-2024లో ఆడిన 4 ఇన్నింగ్స్​ల్లో కలిపి 152 రన్స్ చేశాడతను. వరుసగా 2 ఫిఫ్టీలు బాదాడు. డీసీ తరఫున లీడింగ్ రన్ స్కోరర్​గా ఉన్న పంత్.. బుధవారం కోల్​కతా నైట్ రైడర్స్​ మీద చెలరేగిపోయాడు. అతడు కొట్టిన ఓ షాట్​ చూసి కింగ్ ఖాన్ షారుక్ బిత్తరపోయాడు.

వెంకటేష్ అయ్యర్ వేసిన 12వ ఓవర్​లో పంత్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్​లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు పంత్. అదే ఓవర్​లో అతడు కొట్టిన ఓ ఫ్లిక్ షాట్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఫుల్ లెంగ్త్​లో అయ్యర్ వేసిన బాల్​ను కాస్త వంగి లెగ్ సైడ్ ఫ్లిక్​ షాట్​ కొట్టాడు పంత్. నిల్చున్న చోటు నుంచే ఎక్కువ బలం కూడా యూజ్ చేయుకుండా కేవలం తన మోకాళ్లు, చేతుల సాయంతో ఆ బాల్​ను పర్ఫెక్ట్ టైమింగ్​తో ఫ్లిక్ చేశాడు పంత్. బాల్ పడుతున్న సమయంలో మాత్రమే దాని వైపు చూసిన పంత్ షాట్ ఫినిష్ అయ్యాక చూడలేదు. ఈ అద్భుతమైన నో లుక్ షాట్​కు బంతి కాస్తా వెళ్లి స్టాండ్స్​లో పడింది. ఈ సిక్స్ చూసి కేకేఆర్ యజమాని షారుక్ షాకయ్యాడు. ఇదేం షాట్​ రా బాబు అంటూ బిత్తరపోయాడు. వెంటనే తేరుకొని చప్పట్లు కొడుతూ ప్రత్యర్థి టీమ్ బ్యాటర్ అయిన రిషబ్​ను మెచ్చుకున్నాడు.

కోల్​కతాతో మ్యాచ్​లో ఓవరాల్​గా 25 బంతులు ఎదుర్కొన్న పంత్ 55 పరుగులు చేశాడు. ఇందులో 4 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. రిషబ్​తో పాటు ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 54) కూడా తుఫాన్ ఇన్నింగ్స్​ ఆడాడు. అయినా కేకేఆర్ సంధించిన 272 పరుగుల భారీ స్కోరును ఛేజ్ చేయలేకపోయింది డీసీ. ఆ టీమ్ 166 పరుగులకే కుప్పకూలింది. ఓడిపోయినా గానీ పంత్, స్టబ్స్ ఆడిన తీరుకు అంతా ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా ఈ టోర్నీతో కమ్​బ్యాక్​ ఇచ్చిన రిషబ్ షాట్లు కొట్టిన విధానం, ఫియర్​లెస్ అప్రోచ్, ఫిట్​నెస్, ఫామ్ చూసి టీమిండియా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతడు ఇలాగే ఆడితే టీ20 వరల్డ్ కప్​లో భారత్​కు తిరుగుండదని చెబుతున్నారు. ఇక, పంత్ షాట్​కు బిత్తరపోయిన షారుక్.. మ్యాచ్ ముగిశాక అతడ్ని కలసి హగ్ చేసుకున్నాడు. మరి.. రిషబ్ నో లుక్ షాట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: ఇది కదా డెలివరీ అంటే.. రస్సెల్ పై పగ తీర్చుకున్న ఇషాంత్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి