iDreamPost
android-app
ios-app

Hardik Pandya: KKRతో మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైమ్! పిక్స్ వైరల్..

  • Published May 04, 2024 | 8:56 AM Updated Updated May 04, 2024 | 8:56 AM

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హార్ట్ బ్రేక్ అయ్యింది. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు పాండ్యా నిరాశలో ఉన్నాడు. అతడు బాధలో ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హార్ట్ బ్రేక్ అయ్యింది. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు పాండ్యా నిరాశలో ఉన్నాడు. అతడు బాధలో ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Hardik Pandya: KKRతో మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైమ్! పిక్స్ వైరల్..

IPL 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ సీజన్ నుంచి పాండ్యా టీమ్ నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 8 అపజయాలతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ సీజన్ లో అటు కెప్టెన్ గా, ఇటు బ్యాటర్ గా దారుణంగా విఫలం అయ్యాడు హార్దిక్ పాండ్యా. ముంబై కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న దగ్గర్నించి పాండ్యాపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో పాండ్యాను అలా చూడలేకపోయారు ఫ్యాన్స్. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హార్దిక్ పాండ్యాను ఏరి కోరి మరీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేసింది యాజమాన్యం. కానీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో దారుణంగా విఫలం అయ్యాడు పాండ్యా. జట్టును నడిపించడంతో పాటుగా బ్యాటర్, బౌలర్ గా పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ భారీ మూల్యం చెల్లించుకుని ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీంతో పాండ్యాపై మరింతగా విమర్శల దాడి పెరిగిపోయింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో బాధలో ఉన్న పాండ్యాను చూడలేకపోయారు ఫ్యాన్స్. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు.

ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లను ఎదుర్కొలేక.. ఒకరి వెంట ఒకరు తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరారు. దీంతో వారు అలా అవుట్ అవుతుండటాన్ని చూడలేక నిరాశలో మునిగిపోయాడు. బాధలో తన మెుఖాన్ని చేతుల్లో దాచుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ పాండ్యా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఇది, ఇప్పటి వరకు హార్దిక్ ను ఇలా చూడలేదు పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం పాండ్యాను ఇలా చూడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓ బంతి మిగిలి ఉండగానే 169 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 170 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక 145 రన్స్ కే ఆలౌట్ అయ్యింది ముంబై. దీంతో 24 పరుగులతో ఓటమిని చవిచూసింది. పాండ్యాను ఇంత బాధగా చూడటం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.