iDreamPost

కెప్టెన్సీపై ఎందుకంత మోజు? పాండ్యా మీద టీమిండియా మాజీ కోచ్ సీరియస్!

  • Published Mar 31, 2024 | 3:12 PMUpdated Mar 31, 2024 | 3:12 PM

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద టీమిండియా మాజీ కోచ్ సీరియస్ అయ్యాడు. హార్దిక్.. సారథ్యంపై అంత మోజు ఎందుకని ప్రశ్నించాడు.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద టీమిండియా మాజీ కోచ్ సీరియస్ అయ్యాడు. హార్దిక్.. సారథ్యంపై అంత మోజు ఎందుకని ప్రశ్నించాడు.

  • Published Mar 31, 2024 | 3:12 PMUpdated Mar 31, 2024 | 3:12 PM
కెప్టెన్సీపై ఎందుకంత మోజు? పాండ్యా మీద టీమిండియా మాజీ కోచ్ సీరియస్!

క్రికెట్​లో దాదాపుగా అందరు ప్లేయర్లు కెప్టెన్సీ మీద ఇష్టం చూపిస్తుంటారు. దేశం తరఫున ఆడటం ఓ కల అయితే.. నేషనల్ టీమ్​కు సారథ్యం వహించడం మరో డ్రీమ్​గా చెప్పొచ్చు. టీమ్​లో ప్లేస్ ఫిక్స్ అయ్యాక ప్రతి ప్లేయర్ కెప్టెన్సీ కోసం ప్రయత్నిస్తారు. అయితే ఎవరో ఒకరికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఆ ఛాన్స్ రాని వాళ్లు గేమ్ మీద ఫోకస్ పెడుతూ కెరీర్​ను సుదీర్ఘంగా మలచుకోవాలని చూస్తారు. కానీ కొందరు మాత్రం కెప్టెన్సీ కోసం ఏదైనా చేస్తారు. ఫ్రాంచైజీ క్రికెట్​లోనైతే అవసరమైతే జట్లు కూడా మారతారు. ఇలాంటి వాళ్లు పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా అలాగే ఉంది. సారథ్యం ఆఫర్ రావడంతో గుజరాత్ నుంచి ఎంఐకి వచ్చేశాడు పాండ్యా. కానీ మెగా లీగ్​లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ టీమ్​ను గెలిపించలేకపోయాడు. అతడి ఫెయిల్యూర్​ జట్టును దారుణంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో పాండ్యాపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సీరియస్ అయ్యాడు.

కెప్టెన్సీ మీద హార్దిక్​కు అంత మోజు ఎందుకంటూ ఫైర్ అయ్యాడు రవిశాస్త్రి. సారథ్యం కోసం 2021లో ముంబై ఇండియన్స్​ను వదిలి వెళ్లిపోయాడని.. మళ్లీ ఇప్పుడు దాని కోసమే ఆ టీమ్​కు తిరిగొచ్చాడని విమర్శించాడు. కెప్టెన్సీ అంటే అతడికి ఎందుకంత మోజు అనేది తనకు అర్థం కావడం లేదన్నాడు. సారథ్య బాధ్యతలు కాదు.. ముందు అతడు తన పెర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయాలని సూచించాడు రవిశాస్త్రి. బ్యాటర్​గా, బౌలర్​గా తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవడం మీద అతడు వర్క్ చేయాలని తెలిపాడు. ఫిట్​నెస్​ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని.. అప్పుడే మరింత బెటర్​గా పెర్ఫార్మ్ చేయడం సాధ్యం అవుతుందని స్పష్టం చేశాడు. కెప్టెన్​గా ఏదో చేసేయాలనే ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి.. ఆటగాడిగా తన బెస్ట్ ఇచ్చేందుకు హార్దిక్ ముందు ప్రయత్నించాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Team India's former coach is serious about Pandya!

ఐపీఎల్ మాయలో పడి టీమిండియా గురించి ఆలోచించడం మర్చిపోవద్దని రవిశాస్త్రి చెప్పాడు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం నెమ్మదిగా ఆడుతున్నాడని.. ఇది సరిపోదన్నాడు. కోహ్లీ మరింత వేగంగా పరుగులు చేయాలని, తన స్ట్రయిక్ రేట్​ను మెరుగుపర్చుకోవాలని సూచించాడు. అదే సమయంలో హార్దిక్ తన బౌలింగ్ మీద ఫోకస్ చేయాలని.. పరుగుల్ని కట్టడి చేస్తూ, వికెట్లు పడగొట్టడం మీద పని చేయాలని తెలిపాడు రవిశాస్త్రి. పాండ్యా తనను తాను ఇంప్రూవ్ చేసుకోకపోతే కష్టమేనని.. టీ20 వరల్డ్ కప్​ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని వార్నింగ్ ఇచ్చాడు. హార్దిక్ కంటే బెటర్​గా ఆడుతున్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని అతడు తన ఆటతీరును మార్చుకోవాలని హితవు పలికాడు. మరి.. పాండ్యాపై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీమిండియాలోకి మయాంక్ యాదవ్.. T20 వరల్డ్ కప్​తో ఇంటర్నేషనల్ డెబ్యూ!

 

View this post on Instagram

 

A post shared by CricFit | Cricket News Update (@cricfit)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి