iDreamPost

ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్స్‌కి అలర్ట్.. లావాదేవీల విషయంలో రూల్స్ మారనున్నాయా?

  • Published May 09, 2024 | 10:13 PMUpdated May 09, 2024 | 10:13 PM

ఫోన్ పే, గూగుల్ పే యాప్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆ యాప్ ల యూజర్లపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ పే, గూగుల్ పే యాప్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆ యాప్ ల యూజర్లపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.

  • Published May 09, 2024 | 10:13 PMUpdated May 09, 2024 | 10:13 PM
ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్స్‌కి అలర్ట్.. లావాదేవీల విషయంలో రూల్స్ మారనున్నాయా?

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ సేవలు ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైపోయాయి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ యూపీఐ సేవల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఎటువంటి లిమిట్ లేకుండా ఈ యాప్ లు లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. అయితే డిజిటల్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిస్టంకి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ సిస్టం ద్వారానే ఫోన్ పే, గూగుల్ పే వంటి సంస్థలు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. అయితే యూపీఐ డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్న ఎన్పీసీఐ.. ఆ యూపీఐ యాప్ ల వాల్యూమ్ ని తగ్గించాలని గతంలోనే నిర్ణయించింది.

ఈ యాప్ ల వాల్యూంని 30 శాతానికి పరిమితం చేయడానికి డిసెంబర్ 31 గడువును అమలు చేయడంపై ఎన్పీసీఐ రిజర్వ్ బ్యాంకుతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికైతే వాల్యూమ్ క్యాప్ అనేది లేదు. మార్కెట్లో ఫోన్ పే, గూగుల్ పేలు దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే ఈ యాప్ ల ద్వారా యూపీఐ పేమెంట్స్ ని నియంత్రించేందుకు ఎన్పీసీఐ 2022లోనే ఈ యాప్స్ కి 30 శాతం మార్కెట్ క్యాప్ ని ప్రతిపాదించింది. మార్కెట్ లో వీటి వాటాపై లిమిట్ ని పరిమితం చేయడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది. మార్కెట్ క్యాప్ ల లిమిట్ ప్రతిపాదనను అమలు చేయడానికి గడువు 2023 డిసెంబర్ లో ముగిసినా ఇంకా ఆ ప్రతిపాదన నెరవేరలేదు. ఈ విషయంలో ఆర్బీఐ గానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

30 శాతం మార్కెట్ క్యాప్ ను అమలు చేయడానికి సర్క్యులర్ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. 2024 ఏప్రిల్ లో ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి, అలానే వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి నగదు లావాదేవీల విషయంలో దాదాపు 49 శాతం వాటాతో ఫోన్ పే యూపీఐ మార్కెట్ ని నడిపింది. యూపీఐ లావాదేవీల్లో 2020 నుంచి ఫోన్ పే మొదటి స్థానంలో ఉంది. ఇక గూగుల్ పే 38 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. అయితే ఏప్రిల్ నెలలో యూపీఐ ఎకో సిస్టంలో పేటీఎం మార్కెట్ వాటా మాత్రం 8.4 శాతానికి పడిపోయింది. ఎన్పీసీఐ ఇటీవలే ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ని లాంఛ్ చేసింది.

బ్యాంక్ ఆఫ్ నమీబియాతో భాగస్వామిగా ఉంది. మన దేశ యూపీఐ వ్యవస్థలానే పేమెంట్ సిస్టంని డెవలప్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియాకి ఎన్ఐపీఎల్ సహాయం చేయనుంది. దేశీయంగా, అంతర్జాతీయ పేమెంట్ నెట్వర్క్స్ తో ఈజీగా, చౌకగా లావాదేవీలతో.. నమీబియా దేశ ఆర్థిక పర్యావరణ వ్యవస్థను ఆధునీకరించడమే ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య లక్ష్యం. ఇది జరగాలంటే ఎన్ఐపీఎల్ అధిక మార్కెట్ వాటాను కలిగి ఉండాలి. అందుకే గూగుల్ పే, ఫోన్ పే మార్కెట్ క్యాప్ పై లిమిట్ విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఫోన్ పే, గూగుల్ పే యూజర్లపై ప్రభావం పడనుంది. ఆ రెండు కంపెనీలు.. తమ యూజర్లకు లావాదేవీల విషయంలో లిమిట్ విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి