iDreamPost

KL Rahul: SRHపై ఓటమి, దారుణ అవమానంతో  KL రాహుల్ సంచలన నిర్ణయం?

సన్ రైజర్స్ పై ఓటమి, లక్నో ఓనర్ అవమానించడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ పై ఓటమి, లక్నో ఓనర్ అవమానించడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

KL Rahul: SRHపై ఓటమి, దారుణ అవమానంతో  KL రాహుల్ సంచలన నిర్ణయం?

సన్ రైజర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ను దారుణంగా అవమానించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. హాట్ టాపిక్ గా మారాయి. గ్రౌండ్ లోనే అందరూ చూస్తుండగా.. లక్నో ఓనర్ రాహుల్ ను తిట్టడం, అతడు మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

SRHపై దారుణ ఓటమితో లక్నో ఓనర్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అందరి ముందే గ్రౌండ్ లో రాహుల్ కు క్లాస్ పీకాడు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా. దీంతో గెలుపు ఓటములు సహజం అంత మాత్రాన కెప్టెన్ పై ఇంత అమర్యాదగా ప్రవర్తించాలా? అంటూ నెటిజన్లు గోయెంకాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే?

Kl Rahul

లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది లక్నో టీమ్.  ఢిల్లీ క్యాపిటల్స్,  ముంబై ఇండియన్స్ తో ప్లే ఆఫ్స్ సమరం ఎదుర్కొబోతోంది. అయితే సన్ రైజర్స్ పై దారుణ ఓటమితో ఈ రెండు మ్యాచ్ లకు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటుగా నెక్ట్స్ సీజన్ 2025 ఐపీఎల్ లో లక్నో ఫ్రాంచైజీని వదులుకోనున్నట్లు కూడా వార్తలు వైరల్ గా మారాయి. లక్నోను వదిలి తన సొంత రాష్ట్రమైన బెంగళూరు తరఫున ఆడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అదీకాక గతంలో ఓసారి తనకు ఆర్సీబీకి ఆడాలని ఉందని చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి