iDreamPost

రెండేళ్ల క్రితం జరిగిన క్రైమ్.. ఇప్పటికీ వణికిస్తోంది.. అసలు ఏం జరిగిందంటే?

Pharmacist Vishnu Priya From Panoor: ఇప్పటివరకు ఎన్నో హత్య కేసుల గురించి వినే ఉంటారు. కానీ, ఇది మాత్రం ప్రత్యేకం. ఈ ఘటన జరిగి దాదాపు రెండేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అందరినీ వణికిస్తూనే ఉంది.

Pharmacist Vishnu Priya From Panoor: ఇప్పటివరకు ఎన్నో హత్య కేసుల గురించి వినే ఉంటారు. కానీ, ఇది మాత్రం ప్రత్యేకం. ఈ ఘటన జరిగి దాదాపు రెండేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అందరినీ వణికిస్తూనే ఉంది.

రెండేళ్ల క్రితం జరిగిన క్రైమ్.. ఇప్పటికీ వణికిస్తోంది.. అసలు ఏం జరిగిందంటే?

ప్రాంతం ఏదైనా సొసైటీలో నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయి. క్షణికావాలేశాలు, తప్పుడు నిర్ణయాలు, కోపతాపాలు ఇలా కారణం ఏదైనా ప్రాణాలు తీయడానికి కూడా కొంత మంది వెనుకాడటం లేదు. అలా దాదాపుగా రెండేళ్ల క్రితం ఒక వ్యక్తి చేసిన దారుణం.. ఇప్పటికీ అక్కడి వారిని వణికిస్తోంది. అతి క్రూరంగా ఒక యువతి ప్రాణాలు తీశాడు. ఆ యువతి మృతదేహంపై ఏకంగా 29 గాయాలను గుర్తించారు. ఈ కేసు మొత్తం కథ చూస్తే అందరూ వణికిపోతారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. కోర్టు కూడా తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం.

ఈ హత్య కేసు అక్టోబర్ 22, 2022 కేరళలో జరిగింది. పానూరుకు విష్ణు ప్రియ(23) అనే యువతి ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కన్నూరుకు చెందిన శ్యామ్ జిత్(27)తో పరిచయం ఉండేది. వారు మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగారు. కానీ, వారి మధ్య ఒక చిన్న గొడవ జరగడంతో విష్ణు ప్రియ్ ఆ యువకుడిని దూరం పెట్టిందని తెలిపారు. అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవడంమే మాత్రమే కాకుండా.. తన పెళ్లి ప్రపోజల్ ని విష్ణు ప్రియ నిరాకరించడంతో ఆమె చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్ 20, 2022న అతను ఒక షాపుకు వెళ్లి సుత్తిని కూడా కొనుగోలు చేసినట్లు సీసీటీవీ దృశ్యాలను కూడా కలెక్ట్ చేశారు.

ఇది పక్కాగా ప్లాన్ చేసిన హత్యగానే పోలీసులు కూడా తేల్చారు. ఎప్పటిలాగానే విష్ణు ప్రియ తన పని చేసే ప్లేస్ కు వెళ్లింది. అయితే ఆమె దగ్గరి బంధువు ఎవరో చనిపోయారు అనే విషయం తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు బంధువు చనిపోయిన ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకుని శ్యామ్ జిత్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విష్ణు ప్రియ తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపినట్లు రికార్డుల్లో తెలిపారు. అలాగే ప్రాసిక్యూషన్ కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కూడా కోర్టుల ప్రొడ్యూస్ చేశారు. విష్ణు ప్రియ ఒంటిపై 29 గాయాలు ఉన్నట్లు తెలిపారు.

హత్య జరిగిన రోజు శ్యామ్ జిత్ యువతికి ఇంటికి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి కూడా తన వాగ్మూలాన్ని తెలిపాడు. ఈ కేసులో అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజిత్ కుమార్ కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కూడా కోర్టులో సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా తలస్సెరీ జిల్లా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 10న ఈ దారుణమైన హత్య కేసుకు సంబంధించి తీర్పును వెలువరించనున్నారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అక్కడ ఈ కేసు గుర్తుకురాగానే స్థానికులు వణికిపోతూ ఉంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి