iDreamPost

AP విద్యావ్యవస్థ దేశానికి రోల్ మోడల్! 15 ఏళ్లలో అమ్మఒడి ఆ ఫలాలు అందుతాయి: CM జగన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ లో వచ్చే అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు అందరిని ఆలోచింపజేశాయి.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ లో వచ్చే అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు అందరిని ఆలోచింపజేశాయి.

AP విద్యావ్యవస్థ దేశానికి రోల్ మోడల్! 15 ఏళ్లలో అమ్మఒడి ఆ ఫలాలు అందుతాయి: CM జగన్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది.. రాజకీయ వేడీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ,  జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగితే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సింగిల్ లో పోటీ చేస్తున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోణలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో  సీఎం జగన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అంతేకాక ఆయన ఇచ్చిన స్పీచ్ అందరిని ఆలోచనలో పడేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన 58 నెలల పాలన కాలంలో సంక్షేమ, రాష్ట్రాభివృద్ధి రెండిటిని జోడెద్దుల్లా పరుగులు పెట్టించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి  ఎంతో కృషి చేశారు. అందుకు నిదర్శనమే పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు. ఇది ఇలా ఉంటే.. విద్యా, వైద్య రంగంలో సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి.. పాలనలో గత ప్రభుత్వాలక కంటే భిన్నంగా , ప్రత్యేకంగా కనిపించారు.

ఇదే సమయంలో ‘అమ్మఒడి’ వంటి వివిధ పథకాలకు సీఎం జగన్ కేటాయిస్తున్న నిధులపై ప్రతిపక్షాలు అరోపణలు చేశాయి. అందరికి డబ్బులు పంచుకుంటూ పోతున్నారని, మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని సీఎం జగన్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అంతేకాక సీఎం జగన్ ఇచ్చిన ప్రసంగానికి అందరిని ఆలోచనలో పడేసింది. బుధవారం ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి సీఎం జగన్ వివరించారు. ఈ క్రమంలోనే  కేవలం సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు పంచుతున్నారే కానీ, అభివృద్ధి ఎక్కడా అనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని జర్నలిస్ట్  అడిగారు.

Amma Vodi

సీఎం జగన్ సమాధాన చెబుతూ.. “అమ్మ ఒడి పథకం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. నాకు సంతృప్తిని ఇచ్చిన స్కీమ్. ఈ పథకం ద్వారా తొలుత పేద విద్యార్థులను స్కూళ్లకు అలవాటు చేస్తున్నాం. అమ్మఒడి ద్వారా డబ్బులు ఇవ్వకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది పిల్లలు బడి మానేసే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఆర్థిక సమస్య రాకుండా.. విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు అందజేస్తున్నాను. అదే విధంగా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాను అందిస్తున్నాము. ఇప్పుడు విద్యార్థులపై మనం  చేస్తున్న ఖర్చు భవిష్యత్తులో రాబోయే 10 లేదా 15 ఏళ్లకు ఫలాలు లభిస్తాయి. ఇప్పుడు మనం అందించే నాణ్యమైన విద్యతో బయటకు వెళ్లిన పిల్లలు..పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పట్టాలు పొంది.. మంచి స్థితిలోకి చేరుకుంటారు.

అలా ప్రతి పేద కుటుంబం నుంచి పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తే.. వారి కుటుంబం ఆర్థిక స్థిత మొత్తం మారుతోంది. ఇది కదా రాష్ట్రాభివృద్ధి అంటే. అదే విధంగా మిగిలిన  సంక్షేమ పథకాలు కూడా రాష్ట్రాభివృద్ధికి నిచ్చెనలా పని చేస్తున్నాయి. వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా..వారు.. ఆ డబ్బులను పెట్టుబడిగా పెట్టి.. స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు, ఇతర పనులు చేసుకుంటారు. అలా వారు ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి.. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి పేదవాళ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆటోమెటిక్ గా రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే” అంటూ రాష్ట్రాభివృద్ధిపై తనకు ఉన్న విజన్, క్లారిటీని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా ప్రజలకు ఉన్న సందేహాలను సీఎం జగన్ క్లియర్ చేశారు. సంక్షేమం రూపంలోనే రాష్ట్రాభివృద్ధి దిశగా సీఎం జగన్ పాలన సాగిందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. అలానే సీఎం జగన్ చెప్పిన  ఈ మాటలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. అభివృద్ధి అనే పదానికి సీఎం జగన్ ఇచ్చిన నిర్వచనం, ఆయన తీసుకున్న నిర్ణయాలు సరైనవే కదా అంటూ అభిప్రాయపడుతున్నారు. మరి.. విద్యావ్యవస్థపై సీఎం జగన్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి