iDreamPost
android-app
ios-app

Hardik-Tilak: హార్దిక్-తిలక్ మధ్య గొడవ.. రోహిత్ శర్మ ఎంట్రీతో..!

  • Published May 01, 2024 | 4:56 PM Updated Updated May 01, 2024 | 4:56 PM

హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. ఇద్దరూ టీమిండియాకు కలసి చాలా మ్యాచుల్లో ఆడారు. ముంబై తరఫున కూడా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు ఢీ అంటే ఢీ అంటూ గొడవకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. ఇద్దరూ టీమిండియాకు కలసి చాలా మ్యాచుల్లో ఆడారు. ముంబై తరఫున కూడా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు ఢీ అంటే ఢీ అంటూ గొడవకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Published May 01, 2024 | 4:56 PMUpdated May 01, 2024 | 4:56 PM
Hardik-Tilak: హార్దిక్-తిలక్ మధ్య గొడవ.. రోహిత్ శర్మ ఎంట్రీతో..!

హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ.. ఒకరు ఆల్రెడీ స్టార్ క్రికెటర్. మరొకరు ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్​లో నిలదొక్కుకుంటున్న ప్లేయర్. గేమ్​లో ఇద్దరూ ఇద్దరే. పదునైన పేస్ బౌలింగ్, పవర్​ఫుల్ హిట్టింగ్​తో మ్యాచ్​ను సింగిల్ హ్యాండ్​తో మార్చేసే సత్తా పాండ్యా సొంతం. కఠిన పరిస్థితుల్లో ఉన్న టీమ్​ను బయటపడేయం, ఇన్నింగ్స్​ బిల్డ్ చేయడం, యాంకర్ ఇన్నింగ్స్​తో భారీ స్కోర్లు అందించడంలో తిలక్ ఆరితేరాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. ఇద్దరూ టీమిండియాకు కలసి చాలా మ్యాచుల్లో ఆడారు. ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు ఢీ అంటే ఢీ అంటూ గొడవకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆ టీమ్​లోని యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​ తర్వాత ఇద్దరు క్రికెటర్ల మధ్య ఫైట్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. డీసీతో మ్యాచ్​లో తిలక్ ఆడిన తీరుపై పాండ్యా అసహనానికి గురయ్యాడట. దీంతో డ్రెస్సింగ్ రూమ్​లో అందరిముందే అతడి మీద తన కోపాన్ని చూపించాడట. తిలక్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడని క్రికెట్ వర్గాల సమాచారం. ఇద్దరూ బాహాబాహీకి దిగడంతో ఫైట్ మరింత ముదిరేలా ఉండటంతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్యలో కలుగజేసుకున్నాడట. హార్దిక్, తిలక్​ను హిట్​మ్యాన్ సముదాయించాడని, దీంతో అంతా సద్దుమణిగిందని వినికిడి. అయితే ఈ గొడవకు ప్రధాన కారణం తిలక్ ఆటతీరు మీద హార్దిక్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది.

సాధారణంగా జట్టులోని ఆటగాళ్లు విఫలమైతే దాని గురించి అతడితో పర్సనల్​గా డిస్కస్ చేయడం లేదా కోచ్​ ముందు కూర్చోబెట్టి మాట్లాడటం వంటివి చేస్తుంటారు. డ్రెస్సింగ్ రూమ్​లో అందరి ముందు ఇలాంటి వాటి ప్రస్తావన తీసుకురారు. కానీ తిలక్ బ్యాటింగ్ గురించి ఏకంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్​లోనూ హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు. అతడి వల్లే తాము ఓడామని బద్నాం చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్​లో అతడు దూకుడుగా ఆడకుండా సింగిల్స్ తీశాడని.. అక్కడే మ్యాచ్ టర్న్ అయిందని చెప్పాడు. ఈ విషయంలో కోపంగా ఉన్న తిలక్.. డ్రెస్సింగ్ రూమ్​లో హార్దిక్​ ఆ ప్రస్తావన తీసుకురాగానే సీరియస్ అయ్యాడని, అలా గొడవ పెరిగిందని వినిపిస్తోంది. రోహిత్ కలుగజేసుకోకపోతే ఫైట్ ఇంకా పెరిగేదని అంటున్నారు. ఈ గొడవతో ముంబైలో చీలికలు ఉన్నాయనే విషయం మరోసారి బయటపడ్డాయని చెబుతున్నారు. మరి.. హార్దిక్-తిలక్ ఫైట్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)