iDreamPost

అపోజిషన్ టీమ్స్​తో ఆడుకుంటున్న అన్​సోల్డ్​ ప్లేయర్.. అదృష్టం అంటే గుజరాత్​దే!

  • Published Mar 31, 2024 | 6:17 PMUpdated Mar 31, 2024 | 6:17 PM

గుజరాత్ జట్టులోని ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. ఆక్షన్​లో అన్​సోల్డ్​గా మిగిలిపోయినోడు ఆ కసిని అంతా మ్యాచ్​ల్లో చూపిస్తున్నాడు. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ జట్టులోని ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. ఆక్షన్​లో అన్​సోల్డ్​గా మిగిలిపోయినోడు ఆ కసిని అంతా మ్యాచ్​ల్లో చూపిస్తున్నాడు. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 31, 2024 | 6:17 PMUpdated Mar 31, 2024 | 6:17 PM
అపోజిషన్ టీమ్స్​తో ఆడుకుంటున్న అన్​సోల్డ్​ ప్లేయర్.. అదృష్టం అంటే గుజరాత్​దే!

ఫ్రాంచైజీ క్రికెట్​లో ఏ టీమ్ అయినా స్టార్ ప్లేయర్ల మీదే ఎక్కువ మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తుంది. ఆక్షన్​లో వారి కోసం తెగ పోటీపడుతుంది. కోట్లకు కోట్లు కుమ్మరించేందుకు రెడీ అవుతుంది. అయితే ఇలా భారీ ధరకు తెచ్చుకున్న స్టార్లలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అదే టాలెంట్ ఉండి కూడా వెలుగులోకి రాని ప్లేయర్లను తీసుకొని ప్రోత్సహిస్తే రాణించాలనే కసితో ఆడతారు. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టపడతారు. అందుకే కొన్ని ఫ్రాంచైజీలు ఇలాంటి వాళ్లను వెతికి మరీ పట్టుకుంటాయి. అలా గుజరాత్ టైటాన్స్ ఓ ఆటగాడ్ని దక్కించుకుంది. రెండేళ్ల కింద ఐపీఎల్​లో అన్​సోల్డ్​గా మిగిలిన ఆ ప్లేయర్ ఇప్పుడు జీటీ టీమ్​లో కీలకంగా మారాడు. ఆ జట్టు విజయాల్లో అతడిదే కీ రోల్. ఎవరా ప్లేయర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్​లో దుమ్మురేపుతున్నాడు. నిరుడు కూడా క్యాష్ రిచ్​ లీగ్​లో చెలరేగి బౌలింగ్ చేశాడతను. 14 మ్యాచుల్లో ఏకంగా 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ ఫైనల్స్​కు చేరుకోవడంలో మోహిత్ పోషించిన పాత్రను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈసారి కూడా అదే పెర్ఫార్మెన్స్​ను రిపీట్ చేస్తున్నాడీ పేసర్. ముంబై ఇండియన్స్​తో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు మోహిత్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 1 వికెట్ తీశాడు. ఇవాళ సన్​రైజర్స్​తో జరుగుతున్న పోరులో చెలరేగిపోయాడు మోహిత్. 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

సన్​రైజర్స్​తో మ్యాచ్​లో జోరు మీద ఉన్న అభిషేక్ శర్మ (20 బంతుల్లో 29)ను ఔట్ చేశాడు మోహిత్. అలాగే ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (20), వాషింగ్టన్ సుందర్​ను కూడా పెవిలియన్​కు పంపాడు. లాస్ట్ ఓవర్స్​లో రన్స్​ను కట్టడి చేయడమే గాక కీలక బ్రేక్ త్రూలు అందిస్తూ ప్రత్యర్థి జట్ల దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు మోహిత్. వేరియేషన్సే ప్రధాన బలంగా చెలరేగిపోతున్నాడు. కట్టర్స్, యార్కర్స్, స్లో బాల్స్​తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు సీఎస్​కే తరఫున కొన్ని సీజన్ల పాటు అదరగొట్టిన మోహిత్​ను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఐపీఎల్​-2022లో అతడు అన్​సోల్డ్​గా ఉన్నాడు. అలాంటోడ్ని అక్కున చేర్చుకుంది గుజరాత్. గత సీజన్​కు ముందు అతడ్ని టీమ్​లోకి తీసుకుంది. దీంతో రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మోహిత్.. అపోజిషన్ టీమ్ బ్యాటర్లతో ఆడుకుంటున్నాడు. మరి.. ఈ సీజన్​లో మోహిత్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: MI vs RR: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి