iDreamPost

DC vs KKR: ఢిల్లీ vs కోల్​కతా.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Apr 02, 2024 | 4:34 PMUpdated Apr 02, 2024 | 5:00 PM

విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ, కోల్​కతా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్​లో నెగ్గే టీమ్ మరింత డేంజరస్​గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ మ్యాచ్​లో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ, కోల్​కతా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్​లో నెగ్గే టీమ్ మరింత డేంజరస్​గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ మ్యాచ్​లో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 02, 2024 | 4:34 PMUpdated Apr 02, 2024 | 5:00 PM
DC vs KKR: ఢిల్లీ vs కోల్​కతా.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

వరుస విజయాలతో జోష్ మీద ఉన్న కోల్​కతా నైట్ రైడర్స్​ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్​కు రెడీ అవుతోంది. సూపర్బ్ విక్టరీతో సక్సెస్ ట్రాక్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్​తో అమీతుమీ తేల్చుకోనుంది కేకేఆర్. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్​ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్​ను ఓడించిన పంత్ సేన.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. కోల్​కతా పోరుకు ఆ టీమ్ సై అంటోంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్​లో గెలిచిన టీమ్ మరింత డేంజరస్​గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్

ఈ సీజన్​లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటోంది. గెలుపోటముల సంగతి పక్కనబెడితే బౌలింగ్, బ్యాటింగ్​లో తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచుల్లో ఓడినా మూడో మ్యాచ్​లో తేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్​ సీఎస్​కేను 20 పరుగుల తేడాతో ఓడించింది. పృథ్వీ షా సూపర్ టచ్​లో కనిపిస్తున్నాడు. అతడి రాకతో ఓపెనింగ్ కష్టాలు తీరిపోయాయి. డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ మంచి ఫామ్​లో ఉన్నారు. పంత్​ బ్యాటర్​గా, సారథిగా తన మార్క్ చూపిస్తూ ఆ జట్టుకు కొండంత బలంగా మారాడు. స్టబ్స్, మార్ష్​ నిలకడగా పరుగులు చేస్తే ఆ టీమ్​ను ఆపడం కష్టమే. బౌలింగ్​లో ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ రాణిస్తుండటం అదనపు బలం. ముకేష్ మ్యాచ్ టర్నింగ్ స్పెల్స్​తో చెలరేగుతుండటం బిగ్ ప్లస్.

కోల్​కతా నైట్ రైడర్స్

ఈ సీజన్​లో కోల్​కతా మంచి కాక మీద ఉంది. బ్యాటింగ్ ఆ టీమ్ బలం. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ అద్భుతమైన స్టార్స్ అందిస్తున్నారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ కూడా చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నారు. కెప్టెన్ అయ్యర్ మంచి టచ్​లో కనిపిస్తున్నాడు. బౌలింగ్​లో రస్సెల్, హర్షిత్ రానా అదరగొడుతుండటం కలిసొచ్చే అంశం. మిడిల్ ఓవర్స్​లో రస్సెల్ పరుగులు కట్టడి చేస్తూ కీలకంగా మారాడు. నరైన్ కూడా అవసరమైన టైమ్​లో బ్రేక్​త్రూ అందిస్తున్నాడు. అయితే బౌలింగ్​లో మిచెల్ స్టార్క్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. అలాగే వికెట్లు కూడా తీయడం లేదు. అతడే ఈ జట్టుకు బిగ్ మైనస్​.

ప్రిడిక్షన్

ఈ రెండు జట్ల బలాబలాలను బట్టి ఈ మ్యాచ్​లో కోల్​కతా నెగ్గడం ఖాయం. ఇరు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 32 మ్యాచులు జరిగాయి. ఇందులో 15 మ్యాచుల్లో ఢిల్లీ.. 16 మ్యాచుల్లో కేకేఆర్ గెలిచాయి. అయితే కోల్​కతా ఈ సారి ఉన్న ఫామ్, ఆ జట్టులో ఉన్న బ్యాటింగ్ డెప్త్ చూస్తుంటే ఆ టీమ్​ను ఆపడం పంత్ సేనకు తలకు మించిన పనే.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

ఢిల్లీ:
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోకియా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.

కోల్​కతా:
ఫిల్ సాల్ట్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్​దీప్ సింగ్, అనుకూల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

ఇదీ చదవండి: పాండ్యా మరీ ఇంత సెల్ఫిషా? మ్యాచ్​లో ఇది ఎవరూ గమనించలేదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి