Somesekhar
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధసెంచరీతో జట్టుకు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాడు చెన్నై కెప్టెన్ రుతురాజ్. ఈ క్రమంలోనే ధోనికి కూడా సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సాధించాడు గైక్వాడ్. మరి ఆ వివరాల్లోకి వెళితే..
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధసెంచరీతో జట్టుకు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాడు చెన్నై కెప్టెన్ రుతురాజ్. ఈ క్రమంలోనే ధోనికి కూడా సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సాధించాడు గైక్వాడ్. మరి ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ కు షాకిచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ ను 7 వికెట్లతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. అతడు 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసి చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రుతురాజ్ అరుదైన ఫీట్ సాధించాడు. ఇది ధోనికి సైతం సాధ్యం కాకపోవడం విశేషం. ఇంతకీ ఆ అరుదైన ఘనత ఏంటంటే?
రుతురాజ్ గైక్వాడ్.. ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నైకి వరుసగా రెండు విజయాలు అందించి కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత పరాజయాలు పలకరించాయి. కానీ వాటిని తట్టుకుని చెన్నైని గెలుపు ట్రాక్ ఎక్కించాడు. తాజాగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కేకేఆర్ కు భారీ షాకిచ్చింది. ఈ లోస్కోరింగ్ మ్యాచ్ లో చెన్నై 7 వికెట్లతో కోల్ కత్తాను ఓడించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా.. ఈ ఫిఫ్టీతో గైక్వాడ్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ లో గత ఐదు ఏళ్లలో ఫిఫ్టీ కొట్టిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నిలిచాడు.
కాగా.. గత ఐదు సీజన్లలో కెప్టెన్ గా వ్యవహరించిన ధోని ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. చివరిగా ధోని 2019లో సారథిగా ఉన్నప్పుడు ఫిఫ్టీ కొట్టాడు. కానీ 2022లో ఓ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే అప్పుడు చెన్నై కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఉన్నాడు. దీంతో ధోని సాధించలేనిది రుతురాజ్ సాధించాడు అని నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. మరి రుతురాజ్ ఈ రేర్ ఫీట్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ruturaj Gaikwad becomes the first CSK captain in 5 years to score an IPL fifty. pic.twitter.com/wLKnq7MzBc
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2024
ఇదికూడా చదవండి: IPLలో జడేజా మరో రికార్డు.. హిట్ మ్యాన్ తో సమానంగా..