iDreamPost

IPLలో జడేజా మరో రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!

CSK vs KKR- Ravindra Jadeja: చిదంబరం స్టేడియం వేదికగా కేకేఆర్ పై చెన్నై జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా అద్భుతమైన రికార్డు క్రియేట్ చేశాడు.

CSK vs KKR- Ravindra Jadeja: చిదంబరం స్టేడియం వేదికగా కేకేఆర్ పై చెన్నై జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా అద్భుతమైన రికార్డు క్రియేట్ చేశాడు.

IPLలో జడేజా మరో రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కూడా అలాగే సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్ నుంచి కేకేఆర్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టింది. తొలి ఓవర్ తొలి బంతికే కేకేఆర్ జట్టు సాల్ట్ వికెట్ కోల్పోయింది. అప్పటి నుంచి కేకేఆర్ జట్టు తిరిగి కోలుకోలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా బ్యాటర్లకు ఎక్కడా ఆస్కారం లేకుండా చెన్నై జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ లో పూర్తి ఒత్తిడి తెచ్చింది. పైగా ఈ మ్యాచ్ లో జడేజా ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు.

చిదంబరం స్టేడియంలో చెన్నై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బౌలర్లు ప్రత్యర్థి మట్టి కరిపించేశారు. కేకేఆర్ ఎత్తులు, పైఎత్తులు చెన్నై జట్టు పారలేదు. కేకేఆర్ జట్టు అతి కష్టం మీద 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. జట్టులో ఉన్న టాప్ ప్లేయర్లు అదరూ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేసిన 32 బంతుల్లో 34 పరుగులే హయ్యెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. సాల్ట్ గోల్డెన్ డక్, నరైన్(27), రఘువన్షీ(24), వెంకటేశ్ అయ్యర్(3), రమన్ దీప్ సింగ్(13), రింకూ సింగ్(9), రస్సెల్(10), అనుకుల్ రాయ్(3), స్టార్క్ డకౌట్, వైభవ్ అరోరా(1) ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు.

చెన్నై జట్టు బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అద్భుతంగా రాణించారు. రవీంద్ర జడేజా, దేశ్ పాండే ఇద్దరూ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ముస్తాఫిజుర్ కి 2 వికెట్లు, తీక్షణకు ఒక వికెట్ దక్కింది. టాపార్డర్ మొత్తాన్ని జడేజా, దేశ్ పాండే చుట్టేశారు. ఎక్కడా కూడా బ్యాటర్లకు రన్స్ చేసే ఆస్కారం ఇవ్వలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోవడం కేకేఆర్ జట్టు బ్యాటింగ్ లైనప్ పై గట్టి ప్రభావమే చూపింది. ఆ దెబ్బ దెబ్బ ఇంక కేకేఆర్ బ్యాటర్లు కోలుకోలేదు. కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా కూడా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈసారి గంభీర్ వ్యూహాలు చెన్నై ముందు పారలేదు.

మరోవైపు జడేడా అటు బౌలింగ్ లోనే కాకుండా.. ఇటు ఫీల్డింగ్ లో కూడా అదరగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని సాల్ట్ గాల్లోకి లేపగా.. దానిని జడేజా అందుకున్నాడు. అది అతని ఐపీఎల్ కెరీర్లో 99వ క్యాచ్ అనమాట. ఆ తర్వాత ముస్తాఫిజుర్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ ని పట్టుకున్నాడు. ఆ క్యాచ్ తో జడేజా ఫీల్డర్ గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ మ్యాచ్ లో వంద క్యాచ్లు అందుకున్న ఫీల్డర్ గా జడేజా నిలిచాడు. ఎక్కువ క్యాచులు పట్టుకున్న లిస్ట్ లో శిఖర్ ధావన్(98) దాటేశాడు. 100 క్యాచులతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(100) సరసన చేరాడు. ఈ లిస్ట్ లో 110 క్యాచులతో కింగ్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత 109 క్యాచులతో రైనా, 103 క్యాచులతో పొలార్డ్ ఉన్నారు. అయితే ఐపీఎల్ లో 100 క్యాచ్ లతో పాటుగా 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అలాగే సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగానూ జడేజ నిలిచాడు. మరి..  రవీంద్ర జడేజా క్రియేట్ చేసిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి