iDreamPost

వీడియో: కొత్త కెప్టెన్ రుతురాజ్ చేతిలో 2 అస్త్రాలు రెడీ.. అంతా ధోని చలవే!

  • Published Mar 22, 2024 | 5:41 PMUpdated Mar 22, 2024 | 5:41 PM

సీఎస్​కే నయా కెప్టెన్ రుతురాజ్ సరికొత్త ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లూ బ్యాటింగ్​తో అలరించిన ఈ యంగ్ ప్లేయర్.. ఇప్పుడు కెప్టెన్​గానూ ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆల్రెడీ అతడి చేతిలో రెండు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి.

సీఎస్​కే నయా కెప్టెన్ రుతురాజ్ సరికొత్త ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లూ బ్యాటింగ్​తో అలరించిన ఈ యంగ్ ప్లేయర్.. ఇప్పుడు కెప్టెన్​గానూ ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆల్రెడీ అతడి చేతిలో రెండు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి.

  • Published Mar 22, 2024 | 5:41 PMUpdated Mar 22, 2024 | 5:41 PM
వీడియో: కొత్త కెప్టెన్ రుతురాజ్ చేతిలో 2 అస్త్రాలు రెడీ.. అంతా ధోని చలవే!

ఐపీఎల్-2024కి అంతా రెడీ అయిపోయింది. ఎన్నాళ్లుగానో అభిమనులు ఎదురు చూస్తూ వచ్చిన క్షణాలు వచ్చేశాయి. మరికొన్ని గంటల్లో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ స్టార్ట్ కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫస్ట్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారనే దాని కంటే టోర్నీ మొత్తంలో సీఎస్​కే ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దానికి కారణం ఆ టీమ్ కెప్టెన్ మారడమే. సరిగ్గా మెగా లీగ్ ఆరంభానికి ఒక్క రోజు ముందే చెన్నై కెప్టెన్​ ఛేంజ్ అయ్యాడు. సక్సెస్​ఫుల్​గా టీమ్​ను నడిపిస్తున్న మాహీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. యంగ్ బ్యాటర్ రుతురాజ్​ గైక్వాడ్​కు ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. అయితే ధోని పోతూ పోతూ కొత్త కెప్టెన్ చేతిలో రెండు అస్త్రాలు రెడీ చేసి ఇచ్చాడు.

సీఎస్​కే హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్పిన్​కు సహకరిస్తుందనే విషయం తెలిసిందే. ఈ గ్రౌండ్​లో మ్యాచ్ అంటే మినిమం ముగ్గురు స్పిన్నర్లతో దిగడం చూస్తూనే వస్తున్నాం. సూపర్​కింగ్స్ కూడా ఈ వికెట్​పై మెయిన్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో అటాక్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో మీడియం పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబేను కూడా అన్ని విధాలుగా వాడుకోవాలని ఫిక్స్ అయింది. అందుకే నెట్స్​లో వీళ్లిద్దరితో బౌలింగ్​తో పాటు భారీ సిక్సులు బాదడం ప్రాక్టీస్ చేయిస్తున్నాడు ధోని. ఈ సీజన్​లో జడ్డూ, దూబేను ట్రంప్ కార్డులుగా వాడుకోవాలనేది మాహీ ప్లాన్ అని తెలుస్తోంది. వీళ్ల వీరబాదుడుకు అవతలి జట్లు భయపడేలా చేయాలని.. అవి కోలుకునేలోపు మ్యాచ్​ను ముగించేయాలని అతడి స్కెచ్​లా కనిపిస్తోంది. ఈ విధంగా సీజన్ స్టార్ట్ అవడానికి ముందే జడ్డూ, దూబె రూపంలో కొత్త కెప్టెన్ రుతురాజ్ చేతిలో రెండు అస్త్రాలు రెడీ చేసి పెట్టాడు మాహీ.

Ruthuraj has 2 arrows in his hand

చెపాక్ పిచ్​తో పాటు స్పిన్ అనుకూలంగా ఉన్న చోట జడేజాతో అటాక్​ను స్టార్ట్ చేయాలనేది సీఎస్​కే ప్లాన్​లా కనిపిస్తోంది. బౌలింగ్​ను లీడ్ చేయడమే గాక బ్యాటింగ్​లో కూడా ఫియర్​లెస్ అప్రోచ్​తో అతడ్ని ఆడించాలని చూస్తున్నాడట ధోని. అలాగే గత సీజన్​లో సత్తా చాటిన దూబేను కూడా పించ్ హిట్టర్​గా దింపాలని వ్యూహాలు పన్నుతున్నాడట. ప్రాక్టీస్ సెషన్స్​లో దగ్గరుండి మరీ వీళ్లిద్దరి బ్యాటింగ్​ను మాహీ పరీక్షించడమే దీనికి ప్రూఫ్​గా చెప్పొచ్చు. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఈ సీజన్​లో సీఎస్​కేకు తిరుగుండదు. ఈ సీజన్ అనే కాదు.. తర్వాతి సీజన్లలో కూడా ఈ రెండు అస్త్రాలు రుతురాజ్​కు ఉపయోగపడతాయి. ధోని వెపన్స్​ను ఇవ్వడమే కాదు.. దాదాపుగా నెక్స్ట్ టీమ్​ను సెట్ చేసి పెట్టాడు. ఇది రుతు మీద బర్డెన్ తగ్గించడమే గాక అతడి పనిని ఈజీ చేస్తుంది. మరి.. ధోని అస్త్రాలు ఈ టోర్నీలో సక్సెస్ అవుతాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: బుద్ధి మార్చుకోని హార్దిక్.. రోహిత్​ చేసిన సాయాన్ని మర్చిపోయి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి