Nidhan
సీఎస్కే నయా కెప్టెన్ రుతురాజ్ సరికొత్త ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లూ బ్యాటింగ్‌తో అలరించిన ఈ యంగ్ ప్లేయర్.. ఇప్పుడు కెప్టెన్‌గానూ ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆల్రెడీ అతడి చేతిలో రెండు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి.
సీఎస్కే నయా కెప్టెన్ రుతురాజ్ సరికొత్త ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లూ బ్యాటింగ్‌తో అలరించిన ఈ యంగ్ ప్లేయర్.. ఇప్పుడు కెప్టెన్‌గానూ ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆల్రెడీ అతడి చేతిలో రెండు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి.
Nidhan
ఐపీఎల్-2024కి అంతా రెడీ అయిపోయింది. ఎన్నాళ్లుగానో అభిమనులు ఎదురు చూస్తూ వచ్చిన క్షణాలు వచ్చేశాయి. మరికొన్ని గంటల్లో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ స్టార్ట్ కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫస్ట్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దాని కంటే టోర్నీ మొత్తంలో సీఎస్కే ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దానికి కారణం ఆ టీమ్ కెప్టెన్ మారడమే. సరిగ్గా మెగా లీగ్ ఆరంభానికి ఒక్క రోజు ముందే చెన్నై కెప్టెన్ ఛేంజ్ అయ్యాడు. సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌ను నడిపిస్తున్న మాహీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. అయితే ధోని పోతూ పోతూ కొత్త కెప్టెన్ చేతిలో రెండు అస్త్రాలు రెడీ చేసి ఇచ్చాడు.
సీఎస్కే హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్పిన్‌కు సహకరిస్తుందనే విషయం తెలిసిందే. ఈ గ్రౌండ్లో మ్యాచ్ అంటే మినిమం ముగ్గురు స్పిన్నర్లతో దిగడం చూస్తూనే వస్తున్నాం. సూపర్‌కింగ్స్ కూడా ఈ వికెట్‌పై మెయిన్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో అటాక్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో మీడియం పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను కూడా అన్ని విధాలుగా వాడుకోవాలని ఫిక్స్ అయింది. అందుకే నెట్స్‌లో వీళ్లిద్దరితో బౌలింగ్‌తో పాటు భారీ సిక్సులు బాదడం ప్రాక్టీస్ చేయిస్తున్నాడు ధోని. ఈ సీజన్లో జడ్డూ, దూబేను ట్రంప్ కార్డులుగా వాడుకోవాలనేది మాహీ ప్లాన్ అని తెలుస్తోంది. వీళ్ల వీరబాదుడుకు అవతలి జట్లు భయపడేలా చేయాలని.. అవి కోలుకునేలోపు మ్యాచ్‌ను ముగించేయాలని అతడి స్కెచ్‌లా కనిపిస్తోంది. ఈ విధంగా సీజన్ స్టార్ట్ అవడానికి ముందే జడ్డూ, దూబె రూపంలో కొత్త కెప్టెన్ రుతురాజ్ చేతిలో రెండు అస్త్రాలు రెడీ చేసి పెట్టాడు మాహీ.
చెపాక్ పిచ్‌తో పాటు స్పిన్ అనుకూలంగా ఉన్న చోట జడేజాతో అటాక్‌ను స్టార్ట్ చేయాలనేది సీఎస్కే ప్లాన్‌లా కనిపిస్తోంది. బౌలింగ్‌ను లీడ్ చేయడమే గాక బ్యాటింగ్‌లో కూడా ఫియర్లెస్ అప్రోచ్‌తో అతడ్ని ఆడించాలని చూస్తున్నాడట ధోని. అలాగే గత సీజన్లో సత్తా చాటిన దూబేను కూడా పించ్ హిట్టర్‌గా దింపాలని వ్యూహాలు పన్నుతున్నాడట. ప్రాక్టీస్ సెషన్స్‌లో దగ్గరుండి మరీ వీళ్లిద్దరి బ్యాటింగ్‌ను మాహీ పరీక్షించడమే దీనికి ప్రూఫ్‌గా చెప్పొచ్చు. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఈ సీజన్లో సీఎస్కేకు తిరుగుండదు. ఈ సీజన్ అనే కాదు.. తర్వాతి సీజన్లలో కూడా ఈ రెండు అస్త్రాలు రుతురాజ్‌కు ఉపయోగపడతాయి. ధోని వెపన్స్‌ను ఇవ్వడమే కాదు.. దాదాపుగా నెక్స్ట్ టీమ్‌ను సెట్ చేసి పెట్టాడు. ఇది రుతు మీద బర్డెన్ తగ్గించడమే గాక అతడి పనిని ఈజీ చేస్తుంది. మరి.. ధోని అస్త్రాలు ఈ టోర్నీలో సక్సెస్ అవుతాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: బుద్ధి మార్చుకోని హార్దిక్.. రోహిత్ చేసిన సాయాన్ని మర్చిపోయి..!
MS Dhoni is impressed with the six hitting show by Jadeja & Dube. 🔥pic.twitter.com/6RZFuphmWB
— Johns. (@CricCrazyJohns) March 22, 2024