iDreamPost

IPLలో BCCI మరో ప్రయోగం.. ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే!

  • Published Mar 26, 2024 | 3:35 PMUpdated Mar 26, 2024 | 3:35 PM

ఐపీఎల్-2024లో మరో ప్రయోగం చేసేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. ఇది వర్కౌట్ అయితే ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే.

ఐపీఎల్-2024లో మరో ప్రయోగం చేసేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. ఇది వర్కౌట్ అయితే ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే.

  • Published Mar 26, 2024 | 3:35 PMUpdated Mar 26, 2024 | 3:35 PM
IPLలో BCCI మరో ప్రయోగం.. ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే!

క్రికెట్​లో నిబంధనలు మార్చడం కొత్తేమీ కాదు. మ్యాచులు చూసే ఆడియెన్స్​ సౌలభ్యం కోసం గేమ్​లో కొత్త రూల్స్ తీసుకురావడం తెలిసిందే. ఆటగాళ్ల ఇబ్బందులను తొలగించడానికి కూడా నిబంధనలు మారుస్తుంటారు. అయితే రూల్స్ మార్చడమే కాదు.. బ్యాగ్రౌండ్​లో గేమ్​ మీద కొన్ని ఎక్స్​పెరిమెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఎక్కువగా డొమెస్టిక్ లెవల్​లో ప్రయోగాలు చేస్తుంటారు. టెక్నాలజీ ఆధారంగా తీసుకొచ్చే కొన్ని రూల్స్​ వల్ల 100 పర్సెంట్ ఆక్యురెసీతో రిజల్ట్స్ రావాలంటే ఇది తప్పనిసరి. అలాంటి ఓ ఎక్స్​పెరిమెంట్​కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఐపీఎల్-2024లో భారత బోర్డు మరో ప్రయోగం చేస్తోందని తెలిసింది. అసలు ఏంటా ఎక్స్​పెరిమింట్? దాని వల్ల ఎవరికి ఉపయోగం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫుల్ టాస్​ల విషయంలో అంపైర్లు ఇచ్చే నిర్ణయాలతో కొన్నిసార్లు బౌలింగ్ టీమ్స్, మరికొన్ని సార్లు బ్యాటింగ్ టీమ్స్ గొడవకు దిగడం చూసే ఉంటారు. వీటి వల్ల ఎక్కువగా బ్యాటర్లకు నష్టం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నడుము ఎత్తులో దూసుకొచ్చే ఫుల్ టాస్​ల నిర్ణయాల విషయంలో కచ్చితత్వం కోసం బీసీసీఐ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. దీన్ని ఐపీఎల్-2024లో స్టార్ట్ చేసింది. భారత బోర్డు ఏర్పాటు చేసిన ఓ టీమ్ ఈ ఎక్స్​పెరిమెంట్ చేస్తోంది. క్యాష్ రిచ్ లీగ్​లో ఆడుతున్న అందరు ప్లేయర్ల ఎత్తు, కొలతల్ని ఈ టీమ్ సేకరిస్తోందట. వెస్ట్ హై ఫుల్ టాస్​ల విషయంలో రివ్యూకు వెళ్తే థర్డ్ అంపైర్స్ డిసిషన్స్ తీసుకుంటారు. ఈ నిర్ణయాల విషయంలో హాక్-ఐ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అందుకే ఆటగాళ్ల ఎత్తు, కొలతల డేటాను సేకరించి థర్డ్ అంపైర్​ టీమ్​కు అందించనున్నారని తెలుస్తోంది.

అంపైరింగ్ టీమ్ వినియోగించే కంప్యూటర్లలో ఈ డేటాను ఇన్​స్టాల్ చేస్తారని.. తద్వారా టోర్నీలో ఇక మీదట జరిగే మ్యాచుల్లో హై ఫుల్ టాస్​ల విషయంలో కచ్చితత్వం ఉండేలా బోర్డు ప్లాన్ చేసిందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని.. బీసీసీఐ నియమించిన టీమ్ తమ పనులు చేసుకుపోతోందని టాక్ నడుస్తోంది. అయితే ఈ ఎక్స్​పెరిమెంట్ పూర్తయి, సీజన్​లో ఏ సమయంలో అమల్లోకి వస్తుందో క్లారిటీ లేదు. బీసీసీఐ ప్రయోగం గురించి తెలిసిన నెటిజన్స్.. సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. బాడీ ఫుల్ టాస్​ డిసిషన్స్​లో సమస్యను పరిష్కరించేందుకు బోర్డు చేస్తున్న ప్రయోగం సూపర్ అని మెచ్చుకుంటున్నారు. ఈ ఎక్స్​పెరిమెంట్ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​లో కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఫుల్ టాస్​ల విషయంలో ఎక్కువగా బ్యాటర్లు నష్టపోతున్నారని కామెంట్స్ చేస్తుఉన్నారు. మరి.. బీసీసీఐ ప్రయోగం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCB vs PBKS: విరాట్‌ కోహ్లీ పరువు కాపాడిన దినేష్‌ కార్తీక్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి