iDreamPost

RCB vs PBKS: విరాట్‌ కోహ్లీ పరువు కాపాడిన దినేష్‌ కార్తీక్‌!

  • Published Mar 26, 2024 | 1:13 PMUpdated Mar 26, 2024 | 1:30 PM

వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో ఈ ఆర్సీబీ స్టార్ బ్యాట్​తో రెచ్చిపోయాడు. థండర్ ఇన్నింగ్స్​తో ఓడిపోతుందనే మ్యాచ్​ను బెంగళూరు వైపు తిప్పాడు.

వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో ఈ ఆర్సీబీ స్టార్ బ్యాట్​తో రెచ్చిపోయాడు. థండర్ ఇన్నింగ్స్​తో ఓడిపోతుందనే మ్యాచ్​ను బెంగళూరు వైపు తిప్పాడు.

  • Published Mar 26, 2024 | 1:13 PMUpdated Mar 26, 2024 | 1:30 PM
RCB vs PBKS: విరాట్‌ కోహ్లీ పరువు కాపాడిన దినేష్‌ కార్తీక్‌!

ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్​లో ఎలాగైనా టైటిల్​ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఆర్సీబీ విమెన్స్ టీమ్ కప్పు నెగ్గడంతో తాము కూడా సాధించగలమని అనుకుంటున్నారు మెన్స్ టీమ్. అయితే సీజన్​లోని ఫస్ట్ మ్యాచ్​లోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. కానీ వెంటనే తేరుకున్న బెంగళూరు.. సోమవారం పంజాబ్ కింగ్స్​తో జరిగిన రెండో మ్యాచ్​లో విజయం సాధించింది. ఐపీఎల్-2024లో డుప్లెసిస్ సేన బోణీ కొట్టింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్​ను ఛేజ్ చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (77)తో పాటు దినేష్ కార్తీక్ (28 నాటౌట్) సూపర్బ్ నాక్స్​తో టీమ్​కు విక్టరీని అందించారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డీకే.. కోహ్లీ పరువు నిలబెట్టాడు.

పంజాబ్​తో మ్యాచ్​లో బెంగళూరు బౌలింగ్​లో ఫర్వాలేదనిపించింది. కానీ బ్యాటింగ్​లో మాత్రం ఆ జట్టు చేతులెత్తేసింది. బాల్ బ్యాట్ మీదకు సరిగ్గా రాకపోవడంతో షాట్స్ ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న కామెరాన్ గ్రీన్ కూడా సరిగ్గా అన్నే రన్స్ చేసి క్రీజును వీడాడు. మంచి స్టార్ట్ అందుకున్న రజత్ పాటిదార్ (18) దాన్ని భారీ ఇన్నింగ్స్​గా మలచలేకపోయాడు. టీమ్​ను గట్టెక్కిస్తారని అనుకున్న గ్లెన్ మాక్స్​వెల్ (3), అనూజ్ రావత్ (11) కూడా రాంగ్ టైమ్​లో ఔట్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరుగా అందరూ వరుస పెట్టి పెవిలియన్​కు చేరుతున్నా కోహ్లీ మాత్రం పట్టుదలతో ఆడాడు. ఒక్కడే అంత సేపు నిలబడి మ్యాచ్​ను క్లోజ్​గా తీసుకొచ్చాడు.

DK saved

 

విజయానికి ఇంకో 47 పరుగులు కావాల్సిన టైమ్​లో కోహ్లీ కూడా ఔట్ అయ్యాడు. అప్పటికే 6 వికెట్లు పడ్డాయి. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ బ్యాట్​తో చెలరేగిపోయాడు. సంచలన ఇన్నింగ్స్​తో టీమ్​ను గెలుపు తీరాలకు చేర్చాడు. మహిపాల్ లోమ్రోర్ (8 బంతుల్లో 17 నాటౌట్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. 10 బంతులు ఎదుర్కొన్న డీకే.. 28 పరుగులు చేశాడు. ఇందులో 3 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. అంత ఒత్తిడిలోనూ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చక్కటి టైమింగ్​తో షాట్స్ కొట్టాడు. రావడం రావడంతోనే షాట్లు బాదడంతో పంజాబ్ బౌలర్లపై ప్రెజర్ పెరిగింది. దీంతో వాళ్లు లైన్ తప్పి చెత్త బంతులు వేశారు. దీన్ని యూజ్ చేసుకున్న డీకే.. భారీ షాట్లతో మ్యాచ్​ను ముగించాడు. కార్తీక్ అలా ఆడకపోయి ఉంటే మ్యాచ్​లో ఆర్సీబీ ఓడిపోయేది. దీంతో కోహ్లీ ఆడిన అంత మంచి ఇన్నింగ్స్​కు మీనింగ్ లేకుండా పోయేది. డీకే తన బ్యాటింగ్​తో జట్టుకు విజయాన్ని అందించడమే కాదు.. విరాట్ పరువు కూడా నిలబెట్టాడు. మరి.. డీకే ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: T20 వరల్డ్ కప్​లో కోహ్లీ ఆడడా? ఒక్క డైలాగ్​తో వాళ్లకు ఇచ్చిపడేసిన కింగ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి