Nidhan
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ ఇండియన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌కు వచ్చేసిన సంగతి తెలిసిందే. దీని మీద జీటీ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తాజాగా రియాక్ట్ అయ్యాడు.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ ఇండియన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌కు వచ్చేసిన సంగతి తెలిసిందే. దీని మీద జీటీ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తాజాగా రియాక్ట్ అయ్యాడు.
Nidhan
ఐపీఎల్ పండుగకు ఇంకో వారం రోజుల సమయం కూడా లేదు. ఈ సమ్మర్ హీట్‌ను మరింత పెంచేందుకు క్యాష్ రిచ్ లీగ్ రెడీ అవుతోంది. మార్చి 22వ తేదీ నుంచి ఈ మెగా లీగ్‌కు తెరలేవనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. లీగ్ నిర్వాహకులు యాడ్స్ మీద యాడ్స్ ఇస్తూ ఐపీఎల్ సందడిని మరింత పెంచేస్తున్నారు. ఫ్రాంచైజీలు కూడా ప్లేయర్ల రాక, ప్రాక్టీస్ తదితర విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా సన్నాహకాలను మొదలుపెట్టింది. ఆ టీమ్ ఆటగాళ్లు ఒక్క చోట చేరి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ తరుణంలో టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా గుజరాత్‌ను వీడటంపై ఆయన ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు.
గతేడాది ఆఖర్లో నిర్వహించిన ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. పాండ్యాను వదులుకున్న గుజరాత్.. బదులుగా ముంబై నుంచి మరో ఆటగాడ్ని తీసుకోలేదు. కానీ హార్దిక్‌ను ఇచ్చేసిందుకు ఎంఐ నుంచి భారీ మొత్తాన్ని అందుకుందని సమాచారం. అయితే గుజరాత్ కెప్టెన్‌గా రెండేళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్ సడన్‌గా టీమ్‌ను వదిలేయడంతో అప్పట్లో అంతా షాక్ అయ్యారు. పిలిచి కెప్టెన్సీ ఇచ్చి అంత పుష్ చేస్తే అతడు ఎందుకు మధ్యలో వదిలేసి వెళ్లాడో అర్థం కాలేదు. దీనిపై పాండ్యా ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఈ విషయం మీద తాజాగా గుజరాత్ కోచ్ నెహ్రా రియాక్ట్ అయ్యాడు. టైటాన్స్‌లోనే ఉండమని హార్దిక్‌ను తాను ఒప్పించేందుకు ప్రయత్నించలేదన్నాడు.
‘టీమ్‌తోనే ఉండిపొమ్మని హార్దిక్‌ను నేను కన్విన్స్ చేయలేదు. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇలాంటివి సాధారణమే. ఫుట్‌బాల్ లీగ్స్ మాదిరిగానే ఐపీఎల్‌లోనూ ఇలాంటి ట్రాన్స్ఫర్స్ మనం మరిన్ని చూడబోతున్నాం’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. అయితే గుజరాత్ కోచ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాండ్యా వెళ్లిపోతానంటే కనీసం ఆపకపోవడం, మాట మాత్రంగానైనా ఉండిపొమ్మని చెప్పకపోవడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ టీమ్‌లో హార్దిక్ పరిస్థితి ఇదని.. మాట వరసకు కూడా ఆగమనలేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. హార్దిక్ వెళ్తేనే బెటర్ అనుకున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెహ్రా కామెంట్స్‌తో అసలు నిజం బయటపడిందని చెబుతున్నారు. పాండ్యాను పొమ్మనలేకే పొగపెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి కప్ గెలిపించి, ఇంకోసారి రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ వెళ్లిపోతానంటే కనీసం ఆపకపోవడం ఏంటని షాక్ అవుతున్నారు. మరి.. పాండ్యా మీద నెహ్రా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL కోసం ఎదురుచూస్తున్నారా? ఇది పక్కా గుడ్ న్యూస్!
Nehra said “I never tried to convince Hardik to stay back, the way this sport is moving, we will see more such transfers like it happens in football”. [PTI] pic.twitter.com/suBObjFYpd
— Johns. (@CricCrazyJohns) March 16, 2024