iDreamPost

‘జైలర్’ తమిళ్‌ లిరిక్స్ రేంజ్‌లో.. తెలుగు లిరిక్స్ లేకపోవడనికి కారణం?

  • Published Aug 16, 2023 | 3:22 PMUpdated Aug 29, 2023 | 4:56 PM
  • Published Aug 16, 2023 | 3:22 PMUpdated Aug 29, 2023 | 4:56 PM
‘జైలర్’ తమిళ్‌ లిరిక్స్ రేంజ్‌లో.. తెలుగు లిరిక్స్ లేకపోవడనికి కారణం?

సూపర్‌ స్టార్‌.. ఈ పదం వింటే ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే రూపం.. రజినీకాంత్‌. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఒక్క తమిళ ప్రజలనే కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలను తన స్టైల్‌తో, నటనతో మెస్మరైజ్‌ చేస్తున్న స్టార్‌. అందుకే ఆయన ఎప్పుడో గ్లోబర్‌ సూపర్‌ స్టార్‌ అయిపోయారు. సినిమాల్లోకి వచ్చి నాలభై ఏళ్ల పైనే అయినా.. కొత్త కొత్త హీరోలు సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో వస్తున్నా.. రజినీకాంత్‌ స్టార్‌డమ్‌ ముందు నిలవలేకపోతున్నారు. సినిమాలు ఆడినా, ఆడకపోయినా తలైవా క్రేజ్‌ వేరు. హిట్‌, ప్లాప్‌లకు ఆయన స్టార్‌డమ్‌ అతీతం. అయితే.. ఆయన స్టార్‌డమ్‌కు మంచి సినిమా పడితే.. ఇక వసూళ్ల సునామీనే. ఆ విషయాన్ని జైలర్‌ సినిమా నిరూపిస్తోంది. తమిళ్‌తో పాటు రిలీజ్‌ అయిన అన్ని భాషల్లో సినిమా దుమ్ములేపుపోతోంది. ఇప్పటికే పలు సినిమాల రికార్డులను సైతం జైలర్‌ బద్దులుకొట్టింది.

అయితే.. సినిమా హిట్‌ గురించి పక్కనపెడితే.. ఈ మూవీలో ‘హుకూం’ సాంగ్‌ లిరిక్స్‌పై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్‌ స్టైల్‌ అండ్‌ స్టార్‌డమ్‌కు యువ సంచలనం అనిరుద్ధ్‌ అందించిన మ్యూజిక్‌, బీజీఎం నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రజినీకాంత్‌ అలా నడిచొస్తుంటే.. అనిరుద్ధ్‌ ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్‌బమ్స్‌ వస్తున్నాయి. సినిమా రీరిలీజ్‌ ఫంక్షన్‌లో అనిరుద్ధ్‌ ఇచ్చిన స్టేజ్‌ ఫర్మామెన్స్‌ ఏ రేంజ్‌లో వైరల్‌ అయిందో చూశాం. అతను ఊగిపోతూ పాడుతుంటే.. అక్కడున్న వారు తన్మయత్వంతో గొంతుకలిపారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్టార్‌డమ్‌ను వివరిస్తూ సాగే ఆ పాట.. రజినీ అభిమానులే కాదు యావత్‌ సినీ అభిమానులను ఊపేస్తోంది. ప్రస్తుతం జైలర్‌ సాంగ్స్‌ మానియా నడుస్తోంది.

ఈ క్రమంలో హుకూం సాంగ్‌ తమిళ్‌ లిరిక్స్‌ను ఉన్నవి ఉన్నట్లుగా ట్రాన్స్‌లేట్‌ చేసిన కొన్ని వీడియోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ తెలుగు సినీ అభిమానులు అంటున్నారు. అయితే అంతకంటే ముందు హుకూం తెలుగు సాంగ్‌ కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో ఉండే లిరిక్స్‌ కూడా రజినీ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా ఉన్నాయంటూ తెలుగు రజినీ ఫ్యాన్స్‌ ఊగిపోయారు. కానీ, తమిళ్‌ సాంగ్‌ ఒరిజినల్‌ మీనింగ్‌ చూసి.. అవి ఇంకా అద్భుతంగా ఉన్నాయి కదా అనుకుంటున్నారు. ‘Onn Alumba Paatthavan-నీ ఫ్యానిజం బలుపు చూసినోడు, Ungoppan Whistle’ah Kaettavan-మీ తండ్రి విజిల్స్‌ విన్నోడు, Onn Mavanum Peranum Aatam Poda Veppavan-నీ కొడుకు, మనవళ్లను కూడా చిందులేయించగలడు’ అనే అర్థాలు రావడంతో తెలుగు అభిమానులు ఇవి కదా రజినీకాంత్‌ స్టార్‌డమ్‌కు పొగిడే పదాలు అంటూ మెచ్చుకుంటున్నారు. వాటిని యాజిటీజ్‌ ఎందుకు తెలుగులో ఉపయోగించలేదని ప్రశ్నిస్తున్నారు.

అయితే.. తమిళ్‌ నుంచే కాదు.. వేరే ఏ భాష నుంచి తెలుగులోకి పాటలను అనువదించినా.. ఆ ట్యూన్‌కు తగ్గట్లు తెలుగు లిరిక్స్‌ని రాసుకుంటారు రైటర్లు. మాతృ భాషలో ఉన్న భావాన్ని యధాతథంగా తేవడం కంటే కూడా.. సాంగ్‌ ట్యూన్‌కు తగ్గట్లు, అలాగే నటీనటుల లిప్‌ మూమెంట్‌ను సింక్‌ చేస్తూ సాహిత్యం సాగాలి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్లు పాటను ఇతర భాషల్లోకి అనువదించడం కుదరదు. ఒకవేళ అలా మార్చినా.. పాట ట్యూన్‌కు సరిపోదు. అందుకే జైలర్‌కు తెలుగులో లిరిక్‌ రైటర్‌గా పనిచేసిన భాస్కర్‌ భట్ల ఎంతో అద్భుతంగా తెలుగు పాటను రాశారు. కానీ, తమిళ్‌ పాటలో కొన్ని లైన్లకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అయితే.. సంగీతానికి సాహిత్యం జతకట్టినట్లు ఉండాలి. కానీ, ఒరిజినల్‌ సాంగ్‌లోని పదాలను ఉన్నవి ఉన్నట్లు ట్రాన్స్‌లేట్‌ చేస్తే సెట్‌ కాదు. అందుకే ఒరిజినల్‌ సాంగ్‌లో ఉన్న మీనింగ్‌ యాజిటిజ్‌గా తీసుకురావడం కష్టం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by akshi (@akshi_the_killer)

ఇదీ చదవండి: 10 కోట్లు ఇచ్చినా డేట్స్ కష్టమే! స్టార్ హీరోల రేంజ్ కు అనిరుధ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి