iDreamPost

ఈ అర్హతలుంటే చాలు.. 660 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నెలకు 1,51,000 జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ అర్హతలుంటే చాలు.. 660 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నెలకు 1,51,000 జీతం

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నాయి. మీరు జాబ్ కొట్టి జీవితంలో స్థిరపడాలంటే ఇదే మంచి సమయం. తాజాగా కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అర్హతులుంటే చాలు ఈ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు రూ. 1,51,000 జీతం అందుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం 660 వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో మే 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం mha.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పరిశీలించవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎగ్జిక్యూటీవ్ –

  • 80

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎగ్జిక్యూటీవ్

  • 136

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/ఎగ్జిక్యూటీవ్

  • 120

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/ఎగ్జిక్యూటీవ్

  • 170

సెక్యూరిటీ అసిస్టెంట్ /ఎగ్జిక్యూటీవ్

  • 100

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/టెక్

  • 8

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్II/సివిల్ వర్క్స్-

  • 3

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/మోటార్ ట్రాన్స్ పోర్ట్

  • 22

కుక్

  • 10

కేర్‌టేకర్

  • 5

పర్సనల్ అసిస్టెంట్

  • 5

ప్రింటింగ్- ప్రెస్-ఆపరేటర్

  • 1

మొత్తం పోస్టుల సంఖ్య

  • 660

అర్హత

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు పోస్టులన బట్టి అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు అప్లికేషన్ నాటికి 56 ఏళ్లకు మించకూడదు.

జీతం:

  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎగ్జిక్యూటీవ్(లెవల్ 8): రూ. 47,600 నుండి రూ. 1,51,100
  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎగ్జిక్యూటీవ్(లెవల్ 7): రూ. 44,900 నుండి రూ. 1,42,400
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/ఎగ్జిక్యూటీవ్ (లెవల్ 5): రూ. 29,200 నుండి రూ. 92,300
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/ఎగ్జిక్యూటీవ్(స్థాయి 4): రూ. 25,500 నుండి రూ. 81,100
  • సెక్యూరిటీ అసిస్టెంట్ /ఎగ్జిక్యూటీవ్ (లెవల్ 3): రూ. 21,700 నుండి రూ. 69,100
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ II/టెక్ (లెవల్ 4): రూ. 25,500 నుండి రూ. 81,100
  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్II/సివిల్ వర్క్స్ (లెవల్ 7): రూ. 44,900 నుండి రూ. 1,42,400
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ I/మోటార్ ట్రాన్స్ పోర్ట్ (లెవల్ 5): రూ. 29,200 నుండి రూ. 92,300
  • కుక్ (స్థాయి 3): రూ. 21,700 నుండి రూ. 69,100
  • కేర్‌టేకర్ (లెవల్ 5): రూ. 29,200 నుండి రూ. 92,300
  • పర్సనల్ అసిస్టెంట్: రూ. 44,900 నుండి రూ. 1,42,400
  • ప్రింటింగ్-ప్రెస్-ఆపరేటర్ (లెవల్ 2): రూ. 19,900 నుండి రూ. 63,200

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ:

  • 30-05-2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి