iDreamPost

శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన ఇన్ఫోసిస్‌ మూర్తి దంపతులు.. ఎన్ని కేజీలంటే!

  • Published Jul 16, 2023 | 6:04 PMUpdated Jul 16, 2023 | 6:04 PM
  • Published Jul 16, 2023 | 6:04 PMUpdated Jul 16, 2023 | 6:04 PM
శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన ఇన్ఫోసిస్‌ మూర్తి దంపతులు.. ఎన్ని కేజీలంటే!

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ నారాయణ మూర్తి దంపతుల గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే టాప్‌ ఎమ్‌ఎన్‌సీ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ అయినప్పటికి.. ఎంతో నిరాడంబరమైన జీవితం గడుపుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక వీరు చేసే సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. విలువలు, నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు ఈ దంపతులు. ఈ క్రమంలో తాజాగా నారాయణ మూర్తి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలు సమర్పించారు. ఆ వివరాలు..

నారాయణమూర్తి దంపతులు.. జూలై 16, ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీనివాసుడి కోసం వారు ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించారు. స్వామి వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు తాబేలు, బంగారు శంఖువుని తిరుమల టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి వీటిని అందజేశారు. దాదాపు రెండు కేజీల బంగారంతో తయారు ఈ ఆభరణాల విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం. దర్శనం అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి.. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని బహుకరించారు.

నారాయణ మూర్తి భార్య సుధామూర్తి.. తిరుమల వేంకటేశ్వర స్వామిని ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. దశాబ్దాలుగా తిరుమల కొండకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.. కోరుకున్న కోరికలు తీరడంతో అందరి భక్తుల మాదిరిగానే ఏటా శ్రీవారి దర్శనానికి వస్తున్నానని ఆమె వెల్లడించారు. తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తానని తెలిపారు సుధామూర్తి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి