iDreamPost

ఆ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్!

కంపెనీలు..తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు శుభవార్తలు చెబుతుంటాయి. అలానే ఐటీ సేవారంగ సంస్థ ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాక మెయిల్ ద్వారా ఉద్యోగులకు కూడా ఆ సమాచారాన్ని చేరవేసింది.

కంపెనీలు..తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు శుభవార్తలు చెబుతుంటాయి. అలానే ఐటీ సేవారంగ సంస్థ ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాక మెయిల్ ద్వారా ఉద్యోగులకు కూడా ఆ సమాచారాన్ని చేరవేసింది.

ఆ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్!

ప్రవేటు ప్రభుత్వం సంస్థలు ఉద్యోగులకు తరచూ ఏదో ఒక తీపి కబురు చెబుతూనే ఉంటాయి. అయితే ఎక్కువగా ప్రైవేటు రంగానికి చెందిన సంస్థలు.. తమ ఉద్యోగులకు బహుమతులు, బోనస్, డీఏలు వంటివి ఇస్తుంటాయి. ముఖ్యంగా పండుగల సమయాల్లో  రెండు, మూడు నెలల బోనస్ లు ప్రకటిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఏకంగా విలువైన కార్లను, ఇతర వస్తువులను తమ ఉద్యోగులకు బహుమతిగా ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ సాఫ్ట్ వేరే సంస్థ ఇన్ఫోసిస్.. తమ సంస్థలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థలో ఇన్ఫోసిస్ ఒకటి.   ఈ సంస్థ తరచూ తమ ఉద్యోగులకు ఏదో ఒక  తీపి కబురు చెబుతూనే ఉంటుంది.  తాజాగా  త్రైమాసిక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బోనస్ చెల్లించనుంది. ఈ మేరకు  ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది.  ఆ ఈమెయిల్ ప్రకారం.. అర్హులైన ఉద్యోగులకు 80 శాతం వెరియబుల్ పే చెల్లిస్తుంది. జూలై- సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి పనితీరు బోనస్ కు కొంతమంది ఉద్యోగులు అర్హులు కారని ప్రకటించడం ఉద్యోగుల్లో నిరాశ నింపింది. ఈ నెలలో సగటున 80 శాతం చెల్లింపుతో అందజేస్తుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి  గాను క్యూ-2కి సంబంధించి పీఎల్-6 స్థాయి, అంతకంటే తక్కువ బ్యాండ్ లో ఉన్న ఎంప్లాయిస్ కి సంగటున 80 శాతం వేరియబుల్ పేగా అందుకుంటారని మెయిల్ లో పేర్కొంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల పనితీరు, నిర్వహించిన పాత్ర, ఇతర కీలక అంశాల ఆధారంగా ఈ బోనస్ ఉంటుందని తెలిపింది.  అయితే బోనస్ ఎంత  అనే దానిపై స్పష్టత లేదు. బోనస్ ఎంత అనేది యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని సంస్థ పేర్కొంది.

గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభాన్ని.. ఏడాది ప్రాతిపాదికన 3.2 శాతంతో స్వల్పంగా పెరిగి.. రూ. 6,212 కోట్లకు చేరుకుంది.  ఆదాయం కూడా 7 శాతం వృద్ధితో  రూ.38,994 కోట్లకు చేరుకుంది. అయినప్పటీకీ ఇన్ఫోసిస్.. తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను  2024 ఆర్థిక సంవత్సరానికి 1 శాతం నుంచి -2.5 శాతానికి తగిస్తూ సవరించింది. మరి.. ఇన్ఫోసిస్.. తన ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.