iDreamPost

ఇకపై ట్రైన్ టికెట్ పై 75 శాతం వరకు డిస్కౌంట్!.. ఈ రూల్ గురించి మీకు తెలుసా?

భారతీయ రైల్వే బంపరాఫర్ అందిస్తోంది. ట్రైన్ టికెట్లపై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మరి ఈ రూల్ గురించి మీకు తెలుసా? ఎవరు అర్హులు? ఆ వివరాలు మీకోసం..

భారతీయ రైల్వే బంపరాఫర్ అందిస్తోంది. ట్రైన్ టికెట్లపై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మరి ఈ రూల్ గురించి మీకు తెలుసా? ఎవరు అర్హులు? ఆ వివరాలు మీకోసం..

ఇకపై ట్రైన్ టికెట్ పై 75 శాతం వరకు డిస్కౌంట్!.. ఈ రూల్ గురించి మీకు తెలుసా?

ఆసియాలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉంది భారతీయ రైల్వే. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తూ ఆదరణ పొందింది. ఛార్జీలు తక్కువ ఉండడం సౌకర్యవంతమైన ప్రయాణం కావడంతో ప్రజలు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. అందుకే ట్రైన్ మిడిల్ క్లాస్ వారి విమానం అయ్యింది. అయితే భారతీయ రైల్వే కొంతమందికి ఛార్జీలలో రాయితీని కల్పిస్తూ ఉంటుంది. దివ్యాంగులకు, తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి ఇంకా ఇతరులకు టికెట్ ఛార్జీలపై తగ్గింపు అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇకపై వాళ్లకు ట్రైన్ టికెట్ పై 75 శాతం డిస్కౌంట్ లభించనుంది. భారతీయ రైల్వేలో ఉన్న ఈ రూల్ గురించి మీకు తెలుసా?

విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చదువుల కోసం వెళ్లిన స్టూడెంట్స్ ఇంటిబాట పట్టారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్ అందిస్తోంది భారతీయ రైల్వే. స్టూడెంట్ కన్సేషన్ పేరిట వారికి ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇండియన్ రైల్వేస్ వారు చెప్పిన విధంగా స్టూడెంట్స్ కాలేజ్ లేదా స్కూల్ నుంచి ఇంటికి లేదా ఇంటి నుంచి కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ కు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. మీరు స్కూడెంట్స్ అయితే చాలు టికెట్ పై డిస్కౌంట్ పొందొచ్చు.

ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే 75శాతం డిస్కౌంట్ అందిస్తారు. అయితే ఇది అన్ని టికెట్లపై వర్తించదు. జనరల్ లేదా స్లీపర్ క్లాస్ టికెట్లపై మాత్రమే తగ్గింపు ఇస్తారు. అదే విధంగా ఆఫ్ లైన్ లో టికెట్ తీసుకుంటేనే ఇస్తారు. ఆన్ లైన్ లో ఈ ఆప్షన్ లేదు. స్టూడెంట్స్ వయసు 25 ఇయర్స్ కంటే లోపు ఉండాలి. విద్యార్థులు టికెట్లపై డిస్కౌంట్ పొందాలనుకుంటే స్కూల్ లేదా కాలేజ్ ప్రిన్సిపాల్ చేత రైల్వే అధికారులు ఇచ్చిన అప్లికేషన్ ఫాంపై సంతకం చేయించి సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు టికెట్ పై రాయితీని అందిస్తారు. ఇకపై మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి కాలేజీకి లేదా కాలేజీ నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ట్రైన్ జర్నీ చేయదలిస్తే భారతీయ రైల్వే అందించే స్టూడెంట్ కన్సేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి