iDreamPost

ఒక్క రైలు టికెట్‌తో ఏకంగా 56 రోజులు ప్రయాణించే అవకాశం.. ఎలా అంటే?

భారత దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎదో ఒక విధంగా రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. సామాన్యుడి రథం గా ముద్ర పడిన రైలు. నిత్యం లక్షల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. సుదూరం ప్రయాణం చేసేవారు రైలు ప్రయాణం ఎంతో భద్రత అంటారు.

భారత దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎదో ఒక విధంగా రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. సామాన్యుడి రథం గా ముద్ర పడిన రైలు. నిత్యం లక్షల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. సుదూరం ప్రయాణం చేసేవారు రైలు ప్రయాణం ఎంతో భద్రత అంటారు.

ఒక్క రైలు టికెట్‌తో ఏకంగా 56 రోజులు ప్రయాణించే అవకాశం.. ఎలా అంటే?

బ్రిటిష్ కాలం నుంచి సామాన్య ప్రయాణికులకు ఆసరాగా నిలుస్తూ వస్తుంది రైలు. సగటు ప్యాసింజర్ రైలు ఎంతోమంది జీవనోపాది కల్పిస్తుంది. సుదూరం ప్రయాణం చేసేవారు రైలు ప్రయాణం ఎంతో భద్రతగా భావిస్తుంటారు. ఇక నిత్యం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు వారితోపాటు తినుబండారాలు అమ్మేవారికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. పేద, మధ్యతరగతి, ధనిక ఇలా అన్ని వర్గాల వారికి సెఫ్ జర్నీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది రైలు ప్రయాణం. ఇప్పుడు స్వదేశీ గడ్డపై రూపొందిన వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇది డెభ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతావనికి ఎంతో గర్వకారణం అంటారు. అయితే ఒక్క రైలు టికెట్ తో ఏకంగా 56 రోజులు ప్రయాణించవొచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు.. మరి ఆ సదుపాయం ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే శాఖ ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అదేవిధంగా భారతీయ రైల్వే శాఖ సైతం ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. కాకపోతే చాలా కొంత మందికి రైల్వేశాఖ అందించే సదుపాయాల గురించి సరైన అవగాహన ఉండదు. అలాంటి సేవల్లో ఒకటి ‘సర్క్యూలర్ జర్నీ టికెట్’. ప్రయాణికులకు ఇది ఒక ప్రత్యేకమైన రైలు టికెట్. సాధారణ టికెట్ తో పోల్చుకుంటే ఇది భిన్నమైనదని చెప్పాలి. ఈ టికెట్ తో 56 రోజులు రైలు ప్రయాణం చేయవొచ్చు. తరుచూ తీర్థయాత్రంలు చేసే వారు, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ  టికెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసే సమయంలో వేర్వేరు స్టేషన్లలో టికెట్ కొనుగోలు చేస్తే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ సర్క్యూలర్ జర్నీ టికెట్ కొనుగోలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఈ టికెట్ ధర మిగతావాటితో పోల్చుకుంటే.. కాస్త తక్కువే. ఇక సర్క్యూలర్ జర్నీ టికెట్ ఏ క్లాసులోనైనా ప్రయాణికులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు న్యూ ఢిల్లీ నుంచి కన్యా కుమారి వరకు ఉత్తర రైల్వే నుంచి ఈ టికెట్ తీసుకున్నారు అనుకుందాం. మీ టికెట్ పై ప్రయాణం న్యూ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు సాగి ముగుస్తుంది. అయితే సర్క్యూలర్ జర్నీ టికెట్ తో మధుర నుంచి ముంబై సెంట్రల్, బెంగుళూరు, మర్మాగోవా, మైసూర్, తిరువనంతపురం సెంట్రల్ మీదుగా కన్యాకుమారికి చేరుకొని.. అదే మార్గం నుంచి ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు. ఈ లెక్కన సర్క్యూలర్ జర్నీ టికెట్ 56 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ టికెట్ కౌంటర్ నుంచి నేరుగా కొనుగోలు చేయలేరు.. ఈ టికెట్ కావాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అన్న విషయం డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కి లేదా ప్రధాన స్టేషన్స్ మేనేజర్లకు ఇచ్చి టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకే ఒక టికెట్ తో 56 రోజుల వరకు ప్రయాణించే సౌకర్యం మన చేతిలోనే ఉంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి