iDreamPost

OTTలోకి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సీరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jan 17, 2024 | 11:47 AMUpdated Jan 18, 2024 | 10:37 AM

బుల్లితెరపై ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది. కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు సందడి చేస్తున్నాయి. యాక్షన్, కామెడీ, హర్రర్, కుటుంబ తరహా సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

బుల్లితెరపై ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది. కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు సందడి చేస్తున్నాయి. యాక్షన్, కామెడీ, హర్రర్, కుటుంబ తరహా సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

  • Published Jan 17, 2024 | 11:47 AMUpdated Jan 18, 2024 | 10:37 AM
OTTలోకి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సీరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో రంగాల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తమ అభిమాన హీరోల సినిమాలు ధియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో టీవీల్లో దర్శనం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం లభిస్తుంది. యాక్షన్, కామెడీ, హర్రర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సీరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో వివరాలు తెలుసుకుందాం.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఎన్నో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి.. వాటికి మంచి ఆదరణ లభిస్తుంది.  మూవీస్ తరహాలో ఎంతో రిచ్ గా యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ రూపొందించడమే ఇందుకు కారణం అంటున్నారు. రోహిత్ శెట్టి-సుశ్వంత్ ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఓటీటీలో స్ట్రిమింగ్ కి సిద్దమైంది. ఈ సీరీస్ ని రియలన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి రోహిత్ శెట్టి నిర్మించారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

దేశ ప్రజలను విద్రోహుల నుంచి రక్షించడానికి భారతీయ పోలీస్ అధికారులు ఎంతో కష్టపడుతుంటారు. కొన్నిసార్లు తమ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడుతుంటారు. దేశ ప్రజలను, భారతీయ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయాలనుకునే విద్రోహక శక్తులను పోలీసులు  ఎలా ఎదుర్కొన్నారు.. పోలీస్ పవర్ ఎంటో శత్రువులకు  ఎలా చూపించారు అన్న కథాంశంతో రూపొందిన సీరీస్  ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ . ఈ సీరీస్ లో వివేక్ ఒబేరాయ్, సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి ముఖ్యపాత్రలో నటించారు. లిజో జార్జ్, చేతస్, ఆకాశ్ దీప్ ఈ సీరీస్ కి సంగీతం అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి