iDreamPost

IND vs SA: 55కే ఆలౌట్ అయినా.. ఆ విషయంలో భారత్ కంటే సౌతాఫ్రికానే బెస్ట్!

  • Published Jan 03, 2024 | 9:19 PMUpdated Jan 03, 2024 | 9:19 PM

కేప్​టౌన్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్​లో ఆతిథ్య సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఓ విషయంలో మాత్రం భారత్ కంటే ప్రొటీస్ బెస్ట్​గా నిలిచింది.

కేప్​టౌన్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్​లో ఆతిథ్య సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఓ విషయంలో మాత్రం భారత్ కంటే ప్రొటీస్ బెస్ట్​గా నిలిచింది.

  • Published Jan 03, 2024 | 9:19 PMUpdated Jan 03, 2024 | 9:19 PM
IND vs SA: 55కే ఆలౌట్ అయినా.. ఆ విషయంలో భారత్ కంటే సౌతాఫ్రికానే బెస్ట్!

సౌతాఫ్రికా-టీమిండియా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్, సెషన్​కు ఆధిపత్యం మారుతోంది. ఒక సెషన్​లో ఓ జట్టు డామినేషన్ నడిస్తే.. మరో సెషన్ ఇంకో టీమ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. దీంతో అసలైన టెస్ట్ క్రికెట్ మజాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కేప్​టౌన్​లో జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్​లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ నుంచి లభించిన పేస్​, స్వింగ్​ను ఉపయోగించుకున్న భారత బౌలర్లు ఆతిథ్య జట్టును అరవై పరుగుల్లోపే కుప్పకూల్చారు. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. ప్రొటీస్ పేసర్లకు కూడా పిచ్ నుంచి మద్దతు లభించింది. దీంతో వాళ్లు భారత్​ను 153 రన్స్​కు ఆలౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో టీమిండియా కంటే సౌతాఫ్రికానే బెస్ట్​గా నిలిచింది.

భారత ఇన్నింగ్స్​లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్​గా వెనుదిరిగారు. ఓపెనర్​ యశస్వి జైస్వాల్ గోల్డెన్​ డక్​గా పెవిలియన్​కు చేరుకున్నాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (39), యంగ్​ బ్యాటర్ శుబ్​మన్ గిల్ (36) మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పారు. అయితే వీళ్ల భాగస్వామ్యాన్ని బర్గర్ విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (46) ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేష్ కుమార్​ గోల్డెన్​ డక్​లుగా వెనుదిరిగారు. ఒక దశలో 153/4తో పటిష్టంగా కనిపించిన రోహిత్ సేన.. అదే స్కోరుకు మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ చివరి వికెట్​గా వెనుదిరిగాడు. 55 రన్స్​కు ఆలౌట్ అయి పరువు పోగొట్టుకున్న సౌతాఫ్రికా డకౌట్ల విషయంలో భారత్​ కంటే బెస్ట్​గా నిలిచింది. సఫారీ ఫస్ట్ ఇన్నింగ్స్​లో మార్కో యాన్సన్ ఒక్కడే డకౌట్ అయ్యాడు.

టీమిండియా ఇన్నింగ్స్​లో మాత్రం ఏకంగా ఏడుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్​కు చేరుకున్నారు. రోహిత్, గిల్​, కోహ్లీతో పాటు మరే ఇద్దరు రాణించినా భారత్ మంచి లీడ్ సాధించేది. సింగిల్ రన్ కూడా చేయకుండా ఒక జట్టు చివరి 6 వికెట్లు కోల్పోవడం టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్. ఇక, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ప్రస్తుతం 12.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 41 పరుగులతో ఉంది. ఎయిడెన్​ మార్క్​రమ్ (25 నాటౌట్), ట్రిస్టాన్ స్టబ్స్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రొటీస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ (12)​ను యంగ్ పేసర్ ముకేష్ కుమార్ ఔట్ చేశాడు. టోనీ జార్జి (1)ని కూడా అతడే పెవిలియన్​కు పంపాడు. భారత్​ స్కోరుకు సౌతాఫ్రికా ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. సిచ్యువేషన్ చూస్తుంటే రెండ్రోజుల్లో ఈ టెస్ట్ ముగిసేలా ఉంది. మరి.. డకౌట్స్ విషయంలో భారత్ కంటే సౌతాఫ్రికా బెస్ట్​గా నిలవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: BCCIపై లలిత్ మోడీ ఫైర్.. అది వెర్రితనమంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి