iDreamPost

Lalit Modi: BCCIపై లలిత్ మోడీ ఫైర్.. అది వెర్రితనమంటూ..!

  • Published Jan 03, 2024 | 7:28 PMUpdated Jan 03, 2024 | 7:28 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సీరియస్ అయ్యాడు. బోర్డుకు పిచ్చెక్కిందన్నాడు. ఆయన ఎందుకీ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సీరియస్ అయ్యాడు. బోర్డుకు పిచ్చెక్కిందన్నాడు. ఆయన ఎందుకీ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 03, 2024 | 7:28 PMUpdated Jan 03, 2024 | 7:28 PM
Lalit Modi: BCCIపై లలిత్ మోడీ ఫైర్.. అది వెర్రితనమంటూ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి ఇది బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ప్రతి ఏడాది బీసీసీఐ ఖజానాలోకి కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. వ్యూయర్​షిప్ రైట్స్, అడ్వర్టయిజ్​మెంట్స్, స్పాన్సర్​షిప్స్.. ఇలా ఎన్నో విధాలుగా ఐపీఎల్ నుంచి భారత బోర్డుకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఒకవైపు కాసులకు కాసులు రావడం, మరోవైపు ఈ టోర్నమెంట్ ద్వారా ఎందరో యంగ్​స్టర్స్ భారత క్రికెట్​ టీమ్​లోకి వస్తుండటంతో బోర్డు ఫుల్ హ్యాపీగా ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఐపీఎల్ లాభదాయకమే. అయితే టీ20 ఫార్మాట్​లో సాగే ఈ లీగ్ ఉండగానే మరో లీగ్ నిర్వహణకు బీసీసీఐ ప్లాన్ చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. టీ10 ఫార్మాట్​లో లీగ్ పెట్టాలని అనుకుంటోందని వినికిడి. దీనిపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సీరియస్ అయ్యాడు.

టీ10 ఫార్మాట్​లో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటోందనే వార్తల నేపథ్యంలో బోర్డు మీద లలిత్ మోడీ విమర్శలకు దిగాడు. భారత క్రికెట్ బోర్డుకు పిచ్చెక్కిందన్నాడు. ఐపీఎల్ లాంటి సూపర్ సక్సెస్ అయిన లీగ్ ఉండగా టీ10 ఫార్మాట్​లో మరో లీగ్ పెట్టాలని అనుకోవడం వెర్రితనమన్నాడు. ఇది ఏ రకంగానూ భారత క్రికెట్​కు ఉపయోగపడదని చెప్పాడు. ఐపీఎల్​ను మించినది, దాని కంటే ప్రభావితమైనది మరొకటి లేదన్నాడు లలిత్ మోడీ. వ్యూయర్​షిప్​, రెవెన్యూ పరంగా క్యాష్ రిచ్ లీగ్​కు పోటీ వచ్చేది ఏదీ లేదన్నాడు. టీ20 ఫార్మాట్​ను కాదని.. టీ10 వైపు అడుగులు వేయాలని బీసీసీఐ అనుకోవడం మూర్ఖత్వం అని లలిత్ మోడీ పేర్కొన్నాడు.

‘క్రికెట్​లో మొదట టెస్టులు వచ్చాయి. ఆ తర్వాత వన్డేలు, టీ20లు వచ్చాయి. ఇప్పుడు టీ10 క్రికెట్​ ప్రవేశిస్తోంది. అయితే ఈ ఫార్మాట్​ గురించి పక్కనబెడితే.. వన్డే క్రికెట్ చనిపోతోంది. 50 ఓవర్ల ఫార్మాట్ పనైపోయింది. అది ఎప్పటికైనా మరుగున పడాల్సిందే. అందరూ క్రమంగా టెస్టులు, టీ20ల మీద ఫోకస్ పెట్టాలి. అంతేగానీ మరో ఫార్మాట్​ను ఆహ్వానించడం కరెక్ట్ కాదు. అది జెంటిల్మన్​ గేమ్​కు చాలా ప్రమాదకరం. టీ20 క్రికెట్​కు రోజురోజుకీ మరింత ఆదరణ పెరుగుతోంది. ఒకవేళ వేరే లీగ్ నిర్వహణకు ఖాళీ ఉంటే నేను సెకండ్ టీ20 లీగ్ స్టార్ట్ చేసేవాడ్ని. ఫస్ట్ ఫేజ్​లో నెగ్గిన టాప్-4 టీమ్స్​తో సెకండ్ ఫేజ్​లో ఐపీఎల్ జట్లు తలపడేలా ప్లాన్ చేసేవాడ్ని’ అని లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ క్లబ్ ఫార్మాట్​ తరహాలో టీ10 లీగ్ నిర్వహణకు బీసీసీఐ రెడీ అవుతోందని తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపాడు. అయితే ఈ టోర్నీ మొదటి రోజునే అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోస్యం పలికాడు. మరి.. బీసీసీఐది వెర్రితనమంటూ లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Mohammed Siraj: సిరాజ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ చూడండి.. ఎలా పడుకున్నారో..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి