Nidhan
సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసినా టీమ్‌కు ఓటమి తప్పలేదు.
సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసినా టీమ్‌కు ఓటమి తప్పలేదు.
Nidhan
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లతో నిండిన టీమ్ ఈసారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ కచ్చితంగా నెగ్గుతుందని అంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ టెస్ట్‌లో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. విదేశాల్లో ఓటమి మామూలే గానీ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. 2015 తర్వాత టీమిండియాకు ఎదురైన భారీ ఓటమి ఇదే. 2011 నుంచి సౌతాఫ్రికా మీద ఇప్పుడే ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే మ్యాచ్ తర్వాత అతడ్ని మెచ్చుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
ఇన్నింగ్స్ ఆసాంతం మంచి షాట్లతో అదరగొట్టాడు కింగ్ కోహ్లీ. అయితే వరుసగా వికెట్లు పడుతుండటం, టెయిలెండర్లు కూడా బ్యాట్లెత్తేయడంతో.. ఆఖర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో నుంచి బాధతో వెనుదిరిగాడు విరాట్. టీమ్‌ను ఓటమి బారి నుంచి తప్పించలేకపోయాననే బాధ అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే కెప్టెన్ రోహిత్ శర్మ అతడ్ని ఓదార్చాడు. బాగా ఆడావంటూ అతడి భుజం తట్టాడు. కోహ్లీని హిట్‌మ్యాన్ ఓదారుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఒకవైపు ఎన్ని వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కోహ్లీ స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు.

రన్స్ చేస్తూనే వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు కోహ్లీ. కానీ అతడికి ఎవరూ సహకారం అందంచలేదు. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో విరాట్ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 12 బౌండరీలు, ఒక సిక్స్ సాయంతో 76 రన్స్ చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కింగ్ కోహ్లీకి ఒక్క బ్యాటర్ అయినా సహకరించి ఉంటే భారత్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేది. కానీ అది కుదరలేదు. హడలెత్తించే స్పీడ్, భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రొటీస్ బౌలర్లు వేస్తున్న బంతులకు టీమిండియా బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది.
కోహ్లీ మాత్రం సఫారీ బౌలర్లు అడిగిన ప్రతి క్వశ్చన్‌కు తన బ్యాట్‌తో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. బౌండరీలతో ఆతిథ్య టీమ్‌ను భయపెట్టాడు. అయితే ఆఖర్లో వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. టీమ్‌ను ఓటమి బారి నుంచి బయటపడలేకపోయాననే బాధతోనే డ్రెస్సింగ్ రూమ్‌కు బయల్దేరాడు. దీంతో అతడ్ని రోహిత్ ఓదార్చాడు. దీన్ని చూసిన అభిమానులు.. కోహ్లీకి తోడుగా హిట్‌మ్యాన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని అంటున్నారు. సెకండ్ టెస్ట్‌లోనైనా హిట్‌మ్యాన్‌తో పాటు మిగతా బ్యాటర్లు, బౌలర్లు రాణించాలని కోరుకుంటున్నారు. సమష్టిగా ఆడితేనే సౌతాఫ్రికాను వాళ్ల సొంత గడ్డపై ఓడించగలమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీని రోహిత్ ఓదార్చడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న స్టార్క్.. అభిమానికి ఇచ్చిన మాట ప్రకారం..!
Rohit Sharma appreciating the heroic fightback of Virat Kohli at Centurion 👌👏pic.twitter.com/7TED1hFpNG
— Johns. (@CricCrazyJohns) December 29, 2023