iDreamPost

IND vs SA: రెండో టెస్ట్​లో టీమిండియా ఘనవిజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published Jan 04, 2024 | 7:28 PMUpdated Jan 04, 2024 | 7:28 PM

కేప్​టౌన్ టెస్ట్​లో టీమిండియా అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో నెగ్గి సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్​లో భారత్ ఘనవిజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కేప్​టౌన్ టెస్ట్​లో టీమిండియా అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో నెగ్గి సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్​లో భారత్ ఘనవిజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 04, 2024 | 7:28 PMUpdated Jan 04, 2024 | 7:28 PM
IND vs SA: రెండో టెస్ట్​లో టీమిండియా ఘనవిజయానికి 5 ప్రధాన కారణాలు!

తొలి టెస్ట్​లో తమను చావుదెబ్బ తీసిన సౌతాఫ్రికా మీద టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తనదైన స్టైల్​లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. ఈ రెండు టీమ్స్​ మధ్య జరిగిన రెండో టెస్ట్​లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలి రోజు 23 వికెట్లు నేలకూలిన కేప్​టౌన్ పిచ్ మీద రెండో రోజు 10 వికెట్లు పడ్డాయి. డే-1 మొదటి సెషన్ నుంచి డామినేషన్ కనబరుస్తూ వచ్చిన టీమిండియానే ఆఖరికి విజయం వరించింది. రెండో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన ప్రొటీస్ టీమ్ 176 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప టార్గెట్​ను ఛేజించేందుకు బరిలోకి దిగిన భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ముగిసిపోవడం ఓ హైలైట్. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో షార్టెస్ట్ మ్యాచ్​గా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఘన విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెండో టెస్ట్​లో భారత్ విజయంలో ప్రధాన కారణంగా బౌలింగ్​ను చెప్పుకోవాలి. పేస్​, బౌన్స్​కు అనుకూలిస్తున్న పిచ్ మీద పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్​లో వీళ్లిద్దరూ కలసి ఏకంగా 15 వికెట్లు తీశారు. వీళ్లకు తోడు యంగ్ పేసర్స్ ముకేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా రాణించారు. ముఖ్యంగా ముకేష్ తనకు బాల్ ఇచ్చిన ప్రతిసారి బ్రేక్ త్రూలతో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేస్ బౌలర్లు ఓ యూనిట్​లా కలసికట్టుగా ఆడుతూ టీమ్​కు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్​లో టీమిండియా విజయానికి మరో కారణం విరాట్ కోహ్లీ. బౌన్సీ వికెట్ మీద సౌతాఫ్రికా పేసర్లను కాచుకొని ఫస్ట్ ఇన్నింగ్స్​లో 46 పరుగులు చేశాడు కోహ్లీ. ఆఖరి వరకు నిలబడి అతడు చేసిన ఒంటరి పోరాటం వల్లే టీమ్ 153 పరుగులు చేయగలిగింది.

బ్యాటింగ్​లో రన్స్ చేయడమే గాక ఫీల్డింగ్​ టైమ్​లో కూడా కెప్టెన్ రోహిత్​తో పాటు బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి మరో కారణం సిరాజ్-బుమ్రా స్పెల్. బౌలర్లు అందరూ కలసికట్టుగా రాణించినా ఫస్ట్ ఇన్నింగ్స్​లో సిరాజ్ (6/15), సెకండ్ ఇన్నింగ్స్​లో బుమ్రా (6/61) వేసిన స్పెల్స్ కారణంగా సౌతాఫ్రికా టీమ్ తక్కువ రన్స్​కే కుప్పకూలింది. పేస్, బౌన్స్​ను చక్కగా వినియోగించుకుంటూ సఫారీలను సొంత గడ్డపై 55 పరుగుల్లోపే చాప చుట్టేసేలా చేశాడు సిరాజ్. రెండో ఇన్నింగ్స్​లో ఆ టీమ్​ లీడ్​ను 100 పరుగులు దాటకుండా సూపర్బ్‌ డెలివరీస్​తో కట్టిపడేశాడు బుమ్రా. సో, వీళ్లకు అందరికంటే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే.

ఈ మ్యాచ్​లో భారత్ గెలుపునకు మరో కారణం రోహిత్-జైస్వాల్ పార్ట్​నర్​షిప్. టార్గెట్ 79 పరుగులే కానీ వికెట్ పేస్​, స్వింగ్​కు సహకరిస్తోంది. ఎదురుగా రబాడ, జాన్సన్, బర్గర్, ఎంగిడి లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. మంచి స్టార్ట్ దొరకకపోతే టీమ్ కష్టాల్లో పడుతుంది. ఈ తరుణంలో బ్యాటింగ్​కు దిగిన ఓపెనర్లు రోహిత్ (17 నాటౌట్), జైస్వాల్ (28) కలసి ఫస్ట్ వికెట్​కు 44 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆరంభంలోనే వికెట్లు తీసి టీమిండియాపై ప్రెజర్ పెడదామని అనుకున్న సౌతాఫ్రికా ప్లాన్స్​ వీళ్లిద్దరి ముందు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జైస్వాల్ ఔటైనా మిగిలిన లాంఛనాన్ని హిట్​మ్యాన్ కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్​లో రోహిత్ కెప్టెన్​గానూ టైమ్​కు తగ్గట్లు డెసిజన్స్ తీసుకొని, మంచి స్ట్రాటజీతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతూ, కండీషన్స్​కు తగ్గట్లుగా బౌలింగ్​ ఛేంజెస్ చేస్తూ ఆకట్టుకున్నాడు. అతడి లీడర్​షిప్ కూడా భారత్ విజయానికి మరో కారణంగా చెప్పొచ్చు. మరి.. రెండో టెస్ట్​లో టీమిండియా విక్టరీకి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన భారత్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి