iDreamPost

IND vs SA: చరిత్ర సృష్టించిన భారత్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Jan 04, 2024 | 5:56 PMUpdated Jan 05, 2024 | 12:13 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇలా జరగడం ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్.

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇలా జరగడం ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్.

  • Published Jan 04, 2024 | 5:56 PMUpdated Jan 05, 2024 | 12:13 PM
IND vs SA: చరిత్ర సృష్టించిన భారత్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

సౌతాఫ్రికాతో టెస్ట్​ సిరీస్​ను దారుణంగా స్టార్ట్ చేసిన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్​ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ లాంటి స్టార్లతో నిండిన జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడటం ఏంటని అందరూ క్రిటిసైజ్ చేశారు. దీంతో రెండో టెస్ట్​లో రోహిత్ సేన కమ్​బ్యాక్ ఇస్తుందా? లేదా మరో పరాజయంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే విమర్శకులకు భారత జట్టు స్ట్రాంగ్​ రిప్లయ్ ఇచ్చింది. కేప్​టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్ట్​లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో మూడ్రోజులు మిగిలి ఉండగానే మ్యాచ్​ను గెలిచి సిరీస్​ను 1-1తో డ్రా చేసింది. ఇది అలాంటి ఇలాంటి విజయం కాదు.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక మ్యాచ్​ ఇంత త్వరగా ముగిసిపోవడం ఇదే ఫస్ట్ టైమ్.

భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ అత్యంత తక్కువ వ్యవధి (107 ఓవర్లు)లో ముగిసిన లాంగ్ ఫార్మాట్​ మ్యాచ్​గా నిలిచింది. దీంతో రోహిత్ సేన సరికొత్త చరిత్ర సృష్టించినట్లయింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు.. 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్ (6/15) నిప్పులు చెరిగే బంతులకు సఫారీ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్ కూడా తక్కువ స్కోరే చేయగలిగింది. 153 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దీన్ని బట్టే పిచ్ పేస్, స్వింగ్​కు ఎంత బాగా సహకరించిందో అర్థం చేసుకోవాలి. టీమిండియా కూడా తక్కువ స్కోరే చేయడంతో ప్రొటీస్ కమ్​బ్యాక్ ఇస్తుందని అంతా అనుకున్నారు.

రోహిత్ సేన ముందు సౌతాఫ్రికా మంచి టార్గెట్ ఉంచుతుందని అనుకుంటే మళ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ సీన్ రిపీట్ అయింది. ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్​లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఎయిడెన్ మార్క్​రమ్ (106) సెంచరీతో అలరించినా.. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా ఫెయిలయ్యారు. మార్క్​రమ్ లేకపోతే ఆ జట్టు వంద లోపే కుప్పకూలేది. సౌతాఫ్రికా నిర్దేశించిన టార్గెట్​ను రోహిత్ సేన 12 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (28) మంచి స్టార్ట్ అందించాడు. శుబ్​మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కానీ శ్రేయస్ అయ్యర్ (4 నాటౌట్)తో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ (17 నాటౌట్) మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. మరి.. టీమిండియా సంచలన విజయం సాధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Team India: ఇంకెన్నాళ్లు వాళ్ల మీదే ఆధారపడతారు.. ఆ ఇద్దరూ రిటైరైతే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి