iDreamPost

IND vs PAK: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్‌! ఎందుకలా చేశాడు?

IND vs PAK: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్‌! ఎందుకలా చేశాడు?

వన్డే వరల్డ్ కప్ 2023 దిగ్విజయంగా సాగిపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నాయి. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూశారు. కాగా ఈ మ్యాచ్ లో వన్డే వరల్డ్ కప్ హిస్ట్రీలో భారత్ పాక్ ను మరోసారి చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కాగా భారత్, పాక్ మ్యాచ్ లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అంపైర్, టీమిండియా స్టార్ బ్యాటర్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

కాగా ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న హిట్ మ్యాన్ బౌండరీలు, సిక్స్ లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రోహిత్ మెరుపు బ్యాటింగ్ తో భారత్ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. తనదైన మార్క్ షాట్ లతో బ్యాట్ ఝుళిపిస్తూ పరుగుల వరద పారించాడు. పాక్ బౌలర్లకు మరోసారి చెమటలు పట్టించాడు. అయితే హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేసే సమయంలో అంపైర్, రోహిత్ కు మధ్య ఓ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఏంటి రోహిత్ అవలీలగా భారీ సిక్స్ లు కొట్టేస్తున్నావంటూ సరదాగా అంపైర్ రోహిత్ ను అన్నాడు. దీనికి బదులిస్తూ.. చూడండి నా మజిల్ పవర్ ఎంతుందో అంటూ తన కండలను చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఇద్దరి ముఖాల్లో నవ్వులు విరిసాయి.

కాగా ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దాయాదులు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయారు. 42.5 ఓవర్లో 191 పరుగులు చేసిన పాక్ జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత రిజ్వాన్ 49 పరుగులు, ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు, అబ్దుల్లా షఫిక్ 20 పరుగులతో రాణించారు. తర్వార 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విజ‌ృంభించి ఆడడంతో సునాయసంగా విజయం సాధించింది.

హిట్ మ్యాన్ 63 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్స్ లతో 86 పరుగులు చేసి షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఇఫ్తికార్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, 16 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 53 పరుగులు, కేఎల్ రాహుల్ 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. దీంతో టీమిండియా 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేసింది. 07 వికెట్ల తేడాతో పాక్ పై విజయభేరీ మోగించింది. ఈ విజయంతో వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఖాతాలో మూడో విజయం నమోదైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి