Nidhan
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్ల కానిది అతడు చేసి చూపించాడు.
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్ల కానిది అతడు చేసి చూపించాడు.
Nidhan
ఫస్ట్ టెస్టులో ఓటమితో డీలాపడ్డ టీమిండియా రెండో మ్యాచ్‌లో ఎలా ఆడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌ను తట్టుకొని నిలబడగలదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఉప్పల్ టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్న భారత్ రెండో టెస్టులో అదరగొడుతోంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతడు 14 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. శుబ్‌మన్ గిల్ (34) మంచి స్టార్ట్ దొరికినా యూజ్ చేసుకోలేకపోయాడు. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (27) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడటంలో ఫెయిలయ్యాడు. కానీ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (141 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఇంగ్లీష్ టీమ్‌కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్ల కాని ఓ రికార్డును జైస్వాల్ సాధించాడు. ఇంగ్లండ్‌పై తాజా సెంచరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో అభిమానులు జైస్వాల్‌ను మెచ్చుకుంటున్నారు. అతడికి మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు. ఇదే ఫామ్‌ను కొనసాగించి టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లోనూ టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారాలని చెబుతున్నారు. జట్టులోని ఇతర యంగ్‌స్టర్స్ బిగ్ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో జైస్వాల్‌ను చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రెండో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కెప్టెన్ రోహిత్‌తో పాటు గిల్, అయ్యర్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. గిల్, అయ్యర్ మంచి స్టార్ట్స్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. అరంగేట్ర బ్యాటర్ రజత్ పాటిదార్ (32) కూడా బాగా ఆడుతూ బ్యాడ్ లక్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన మొత్తంలో స్కోరులో దాదాపు 60 శాతానికి పైగా పరుగులు జైస్వాల్ బ్యాట్ నుంచే వచ్చాయి. మిగతా బ్యాటర్లు కూడా అతడికి సహకరించి ఉంటే టీమ్ ఇంకా మంచి సిచ్యువేషన్లో ఉండేది. అతడు వన్ మ్యాన్ ఆర్మీలా క్రీజులో నిలబడ్డాడు. జైస్వాల్ స్ట్రయిక్ రొటేషన్‌తో పాటు బిగ్ షాట్స్ కొట్టడానికీ వెనుకాడలేదు. ఎక్కువ డాట్ బాల్స్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. 15 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు బాదాడు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో సూపర్బ్ షాట్స్ బాదాడు. ప్రస్తుతం 144 పరుగులతో ఆడుతున్న జైస్వాల్.. ఇవాళ నాటౌట్‌గా ఉంటే భారత్‌కు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. ప్రస్తుతం భారత్ స్కోరు 74 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 253. యశస్వీతో పాటు అక్షర్ పటేల్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. మరి.. కోహ్లీ, రోహిత్ వల్ల కాని అరుదైన ఘనతను జైస్వాల్ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Yashasvi Jaiswal: వీరేందర్ సెహ్వాగ్‌ను గుర్తుకు తెచ్చిన జైస్వాల్! అచ్చం అలానే..
Yashasvi Jaiswal is the first batter to score 2 hundreds in WTC 2023-25.
– Jaiswal is here to rule. 🔥🫡 pic.twitter.com/gios0hHsCw
— Johns. (@CricCrazyJohns) February 2, 2024