iDreamPost

వీడియో: రోహిత్​కు ఘోర అవమానం! పగబట్టి మరీ..

  • Published Feb 24, 2024 | 5:15 PMUpdated Feb 24, 2024 | 6:30 PM

రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. హిట్​మ్యాన్​కు ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.

రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. హిట్​మ్యాన్​కు ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.

  • Published Feb 24, 2024 | 5:15 PMUpdated Feb 24, 2024 | 6:30 PM
వీడియో: రోహిత్​కు ఘోర అవమానం! పగబట్టి మరీ..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు భారత ఇన్నింగ్స్​ టైమ్​లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హిట్​మ్యాన్​ను ఇంగ్లండ్ అభిమానులు అవమానించారు. బహుశా రోహిత్ కెరీర్​లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు. రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రత్యర్థి జట్టు 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగింది భారత్. కఠిన పిచ్ మీద నిలదొక్కుకొని రన్స్ చేయడం చాలా కష్టంగా మారడంతో రోహిత్ రాణించడం టీమ్​కు ఇంపార్టెంట్​గా మారింది. కానీ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ దెబ్బకు హిట్​మ్యాన్ పెవిలియన్​కు చేరక తప్పలేదు. జిమ్మీ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్ ఇచ్చి ఔటైన భారత సారథి క్రీజును వీడాడు. అయితే ఆ టైమ్​లో అతడికి అవమానం జరిగింది. ఇంగ్లీష్ ఫ్యాన్స్ రోహిత్​ను టార్గెట్ చేసుకున్నారు.

అండర్సన్ బౌలింగ్​లో ఔటైన రోహిత్ శర్మ నిరాశతో క్రీజును వీడాడు. పెవిలియన్​ వైపుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ టైమ్​లో భారత అభిమానులు అంతా సైలెంట్ అయిపోయారు. మంచి ఇన్నింగ్స్​తో అలరిస్తాడనుకుంటే ఇలా ఔట్ అయ్యాడేంటని షాకయ్యారు. టీమ్​ను గట్టెక్కిస్తాడనుకుంటే స్టార్టింగ్​లోనే వికెట్ సమర్పించుకోవడంతో నిరాశ చెందారు. కానీ ఇంగ్లీష్ టీమ్ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ ఔట్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతడు క్రీజులో ఉంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో తెలిసిందే. అందుకే రోహిత్ పెవిలియన్​కు వెళ్తున్న సమయంలో స్టాండ్స్​లో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు అతడికి బైబై చెప్పారు. స్టేడియంలో ఓ చోట గుంపుగా కూర్చున్న ఇంగ్లీష్ సపోర్టర్స్ బై రోహిత్ అంటూ చేతులు ఊపుతూ అవమానించారు.

రోహిత్​కు బైబై చెప్పడమే గాక ఈలలు వేస్తూ, గోల చేశారు ఇంగ్లండ్ ఫ్యాన్స్. హిట్​మ్యాన్​ను ఇంగ్లీష్ టీమ్ అభిమానులు అవమానించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. రోహిత్​ మీద పగబట్టి మరీ అవమానించారు కదా అని ఫైర్ అవుతున్నారు. దీనికి అంతకంతా అనుభవిస్తారని.. సెకండ్ ఇన్నింగ్స్​లో హిట్​మ్యాన్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్​తో స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తాడని అంటున్నారు. రోహిత్​ను అవమానించారు కదా.. ఇక, సిరీస్​లో ఇంగ్లండ్​ ప్లేయర్లు బ్యాటింగ్​కు వస్తే ఇచ్చి పడేస్తామని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన అద్భుతమైన బ్యాటింగ్​ స్కిల్స్​తో, కెప్టెన్సీతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు రోహిత్. ప్రత్యర్థి జట్టు, వాళ్ల అభిమానులు కూడా హిట్​మ్యాన్​ను ఇష్టపడతారు. అలాంటిది ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇలా అవమానించడంపై విమర్శలు వస్తున్నాయి. మరి.. రోహిత్​కు జరిగిన అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తండ్రి రిక్షావాలా.. కూతురు ధోనిని మించిన మ్యాచ్‌ ఫినిషర్‌! ఎవరీ సజనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి