iDreamPost

IND vs ENG: జడేజా ఔట్​పై కాంట్రవర్సీ.. ఆ నిర్ణయం సరైందేనన్న భారత మాజీ కోచ్!

  • Published Jan 27, 2024 | 6:35 PMUpdated Jan 27, 2024 | 6:35 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా వివాదాస్పద రీతిలో పెవిలియన్​కు చేరుకున్నాడు. నాటౌట్ అయినా అతడ్ని ఔట్​గా ప్రకటించారు. కాంట్రవర్సీగా మారిన ఈ విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా వివాదాస్పద రీతిలో పెవిలియన్​కు చేరుకున్నాడు. నాటౌట్ అయినా అతడ్ని ఔట్​గా ప్రకటించారు. కాంట్రవర్సీగా మారిన ఈ విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.

  • Published Jan 27, 2024 | 6:35 PMUpdated Jan 27, 2024 | 6:35 PM
IND vs ENG: జడేజా ఔట్​పై కాంట్రవర్సీ.. ఆ నిర్ణయం సరైందేనన్న భారత మాజీ కోచ్!

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ టీమ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన టీమిండియా 436 రన్స్ చేసింది. దీంతో 190 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసిన స్టోక్స్ సేన నిలకడగా ఆడుతోంది. ఆరుగురు బ్యాటర్లు అప్పుడే పెవిలియన్​కు చేరుకున్నా మంచి ఆటతీరుతో 102 పరుగుల లీడ్​ కూడా సాధించింది. అయితే ఇంకా రెండ్రోజులు మిగిలి ఉండటంతో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పదు. ఇక, ఈ మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్ సమయం​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఔట్ మీద కాంట్రవర్సీ నడుస్తోంది. అతడు నాటౌట్ అయినా ఔట్ ఇచ్చారని భారత అభిమానులు అంటున్నారు. బెనిఫిట్ ఆఫ్​ డౌట్ కింద అతడ్ని ఔట్​గా ప్రకటించడం దారుణమని చెబుతున్నారు. ఈ వివాదంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు. జడ్డూ విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయం సరైందేనన్నాడు.

అంపైర్ల స్థానంలో తాను ఉన్నా జడేజాను ఔట్ ఇచ్చేవాడ్ని అని రవిశాస్త్రి తెలిపాడు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ కాల్ నాటౌట్ అయి ఉంటే బ్యాటర్ అయిన జడ్డూకు అనుకూలంగా ఫలితం వచ్చేదని చెప్పాడు. ఇక, భారత ఇన్నింగ్స్​ 119వ ఓవర్​లో జడేజా 87 పరుగులతో ఆడుతున్నాడు. కేఎస్ భరత్, అక్షర్ పటేల్​తో కలసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన జడ్డూ.. టీమ్​కు భారీ లీడ్ అందించాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోవడం, 180 బంతులు ఎదుర్కోవడంతో పిచ్ ఎలా స్పందిస్తుందో అతడికి అర్థమైపోయింది. దీంతో అతడు భారీ ఇన్నింగ్స్​ ఆడేలా కనిపించాడు. జడ్డూ సెంచరీ ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అప్పుడే బౌలింగ్​కు వచ్చిన జో రూట్ వేసిన ఓ బాల్​కు టీమిండియా బ్యాటర్ ఔట్ అయ్యాడు. రూట్ వేసిన బాల్​ను డిఫెన్స్ ఆడగా.. అది ఒకేసారి బ్యాట్​, ప్యాడ్​కు తగిలింది. దీంతో ఇంగ్లండ్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. బాల్ ముందు బ్యాట్​కు తాకిందనే కాన్ఫిడెన్స్​తో ఉన్న జడ్డూ.. వెంటనే థర్డ్ అంపైర్​కు అప్పీల్ చేశాడు. అయితే రివ్యూ చేసిన థర్డ్ అంపైర్.. బాల్​ మొదట బ్యాట్​కు తాకిందా లేదా ప్యాడ్​కు తగిలిందా అనే విషయంపై కన్​క్లూజన్​కు రాలేకపోయాడు.

ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడుతూ జడ్డూను ఔట్​గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతో తాను నాటౌట్ అయినా అంపైర్ ఔట్​గా ఇవ్వడంతో నిరాశతో గ్రౌండ్​ను వీడాడు జడేజా. జట్టుకు మరింత ఆధిక్యం అందించే అవకాశం మిస్సయిందన్న బాధ, సెంచరీ చేజారిందన్న కోపంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుస్తూ వెళ్లిపోయాడు. అయితే అతడి ఔట్​పై మాత్రం కాంట్రవర్సీ నడుస్తోంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్​గా ఇవ్వాల్సింది పోయి ఔట్ ఎలా ఇస్తారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. చెత్త అంపైరింగ్ అని సీరియస్ అవుతున్నారు. పాపం.. జడ్డూది బ్యాడ్ లక్ అని, సెంచరీ మిస్సయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్​లో కామెంట్రీ చేస్తున్న రవిశాస్త్రి స్పందించాడు. థర్డ్ అంపైర్ డిసిషన్​తో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. ఫీల్డ్ అంపైర్ గనుక నాటౌట్ ఇచ్చి ఉంటే జడ్డూ బతికిపోయే వాడని అన్నాడు. మరి.. జడ్డూ ఔట్ వివాదంపై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి