iDreamPost

వైరల్​గా ధోని అపాయింట్​మెంట్ లెటర్.. మాహీ గురించి తెలియని ఎన్నో నిజాలు!

  • Published Feb 27, 2024 | 5:33 PMUpdated Feb 27, 2024 | 5:33 PM

ఎంఎస్ ధోని క్రేజ్, రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. తాజాగా మాహీకి సంబంధించిన ఓ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లెటర్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంఎస్ ధోని క్రేజ్, రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. తాజాగా మాహీకి సంబంధించిన ఓ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లెటర్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 27, 2024 | 5:33 PMUpdated Feb 27, 2024 | 5:33 PM
వైరల్​గా ధోని అపాయింట్​మెంట్ లెటర్.. మాహీ గురించి తెలియని ఎన్నో నిజాలు!

మహేంద్ర సింగ్ ధోని అంటే.. అద్భుత విజయాలు, వేల కొద్దీ పరుగులు, లక్షల కొద్దీ అభిమానులు మాత్రమే కాదు.. కోట్ల మంది ప్రజల ఆశలు మోసిన లెజండరీ క్రికెటర్. అందుకే క్రికెట్ ఫాన్స్ ఎవ్వరికీ కూడా ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్​ను మతంగా భావించే మన దేశంలో సచిన్ టెండూల్కర్ తరువాత ఒక్క ధోనీకి మాత్రమే ఇంతటి క్రేజ్ సాధ్యమైంది. ఇక మహేంద్రుడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి కొన్నేళ్లు గడుస్తున్నా అతడు అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ కి ఇంకా కొదవలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జార్ఖండ్ డైనమేట్ గురించి ఏ చిన్న అప్డేట్ బయటకి వచ్చినా, ఏ చిన్న వార్త తెలిసినా.. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఇప్పుడు చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

2007 టీ-20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ధోని ఘనతలు ఎన్నో. అతను పట్టుకొచ్చిన పసిడి పథకాలు ఎన్నో. కానీ.. ధోని ఇవన్నీ సాధించకముందు, టీమిండియాలోకి అరంగ్రేటం చేయకముందు ఓ సాధారణ రాష్ట్ర స్థాయి ఆటగాడు. ఆ సమయంలోనే టికెట్ కలెక్టర్ ఉద్యోగం కూడా చేశాడు. ఇంటి పరిస్థితుల కారణంగా ఒకానొక సమయంలో ఆటకి కూడా దూరం కావాలని అనుకున్నాడు. అయితే.. విధిరాత మరోలా ఉండటంతో ధోని లెజండరీ క్రికెటర్ అయ్యాడు. అయితే.. అప్పుడు టికెట్ కలెక్టర్ అయిన ధోని అపాయింట్‌మెంట్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రాంచీ వేదికగా ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ మధ్యలో బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ ధోని అపాయింట్‌మెంట్ లెటర్ టెలికాస్ట్ చేయడం విశేషం. ఈ కారణంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా.. ఈ లెటర్ వైరల్ అవుతోంది.

ఖరగ్​పూర్ రైల్వే స్టేషన్​లో టికెట్ కలెక్టర్​గా ధోని ఉద్యోగం చేసేవాడు. కానీ.. అతని ఆశలు, కలలు, కోరికలు అన్నీ క్రికెట్ పైనే. ఆ కసితోనే మాహీ అక్కడే ఆగిపోకుండా ఇంతటి స్థాయికి వచ్చాడు. ఇక, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ ధోని గురించి చాలా విషయాలే తెలియజేస్తోంది. మహేంద్ర సింగ్ ధోని పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఎడ్యుకేషన్ డీటైల్స్ అన్నీ ఈ లెటర్​లో కనిపిస్తున్నాయి. దీంతో.. ధోని ఫ్యాన్స్ ఈ లెటర్​ను వైరల్ చేస్తున్నారు. కాగా, 2024 ఐపీఎల్ సీజన్ కోసం కూడా ధోని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్​ను మళ్లీ గ్రౌండ్​లో చూడొచ్చు అన్నది వారి ఆశ. ఇక, చెన్నై జట్టుకి సారథిగా కొనసాగుతున్న ధోని.. ఈసారి కూడా టీమ్​కు కప్ అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు మాహీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే.. దీనిపై మహేంద్ర సింగ్ ధోని అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇదీ చదవండి: భారత ఆటగాళ్లకు​ బంపర్ ఆఫర్.. ఆ ఇద్దరి వల్ల BCCI ఆలోచనల్లో మార్పు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి