iDreamPost

భారత ఆటగాళ్లకు​ బంపర్ ఆఫర్.. ఆ ఇద్దరి వల్ల BCCI ఆలోచనల్లో మార్పు!

  • Published Feb 27, 2024 | 4:49 PMUpdated Feb 27, 2024 | 4:49 PM

టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెక్ బోర్డు నుంచి ఊహించని బంపర్ ఆఫర్. ఇద్దరు ప్లేయర్ల కారణంగా బీసీసీఐ ఆలోచన మారిందని తెలుస్తోంది.

టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెక్ బోర్డు నుంచి ఊహించని బంపర్ ఆఫర్. ఇద్దరు ప్లేయర్ల కారణంగా బీసీసీఐ ఆలోచన మారిందని తెలుస్తోంది.

  • Published Feb 27, 2024 | 4:49 PMUpdated Feb 27, 2024 | 4:49 PM
భారత ఆటగాళ్లకు​ బంపర్ ఆఫర్.. ఆ ఇద్దరి వల్ల BCCI ఆలోచనల్లో మార్పు!

ఇంగ్లండ్​తో నాలుగో టెస్టులో నెగ్గడం, సిరీస్​ను 3-1 తేడాతో సొంతం చేసుకోవడంతో భారత జట్టు సంతోషంలో మునిగిపోయింది. సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు, తొలి టెస్టులో ఓడాక ఎదురైన విమర్శలు, సవాళ్లను అధిగమించి గెలవడం మామూలు విషయం కాదు. కానీ వాటన్నింటికీ అదిరిపోయే ఆటతీరుతో, విజయాలతోనే సమాధానం ఇచ్చారు భారత క్రికెటర్లు. బజ్​బాల్​ క్రికెట్​ను చిత్తు చేస్తూ, ఇంగ్లండ్ గర్వాన్ని అణచినందుకు హ్యాపీగా ఉన్నారు. ఈ తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి టీమిండియా ప్లేయర్లకు ఓ గుడ్ న్యూస్. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులను పెంచే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

రెడ్ బాల్ క్రికెట్​ మీద ఆటగాళ్లలో ఇంట్రెస్ట్ పెంచేందుకు అడుగులు వేస్తున్న బీసీసీఐ.. ఈ క్రమంలో మ్యాచ్ ఫీజుల్ని పెంచాలని అనుకుంటోందట. ఏ ఆటగాడైనా క్యాలెండర్ ఇయర్​లో మొత్తం అన్ని సిరీస్​ల్లో భాగమైతే అతనికి వార్షిక కాంట్రాక్ట్ రిటెయిన్​తో పాటు అదనంగా రివార్డు కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించుకుందట. అలాగే మ్యాచ్​ ఫీజులను కూడా భారీగా పెంచాలని భావిస్తోందని టాక్. ఈ డిసిషన్​తో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ప్లేయర్లు ఆసక్తి చూపుతారని అనుకుంటోందని సమాచారం. కాగా, ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్​కు ఫీజుగా రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్​కు రూ.3 లక్షల్ని ఆటగాళ్లకు చెల్లిస్తోంది బోర్డు. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్​ ఫీజును ఏకంగా రూ.20 లక్షలకు పెంచే ఆలోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒకవేళ టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కొత్త రెమ్యూనరేషన్ పెంచుతున్నట్లు ప్రకటించినా అది వెంటనే అమల్లోకి రాదు. ఐపీఎల్-2024 సీజన్ పూర్తయిన వెంటనే ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా, మ్యాచ్ ఫీజుల అంశం హఠాత్తుగా తెరమీదకు రావడానికి యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కారణమని తెలుస్తోంది. భారత జట్టులోకి తిరిగి రావాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాలని బోర్డు ఆదేశించినా వీళ్లిద్దరూ బేఖాతరు చేశారు. గాయం సాకు చూపి అయ్యర్ ఎన్​సీఏలో ఉండిపోగా.. కిషన్ ఐపీఎల్ ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. వీళ్లపై సీరియస్​గా ఉన్న బీసీసీఐ.. అందరూ డొమెస్టిక్ క్రికెట్​లో తప్పకుండా ఆడాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే రెడ్ బాల్ క్రికెట్ వైపు ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఫీజు పెంపు అంశాన్ని తీసుకొచ్చిందని వినికిడి. ఏదేమైనా రెమ్యూనరేషన్స్ పెరిగితే ప్లేయర్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడతారు. అప్పుడు జెంటిల్మన్ గేమ్​కు ఆయువుపట్టు లాంటి టెస్టులకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం. మరి.. బీసీసీఐ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇంగ్లండ్ తో చివరి టెస్ట్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి