iDreamPost

Jasprit Bumrah: బుమ్రా మీద ఆ ముద్ర వేయొద్దు.. టీమిండియా మాజీ కోచ్ రిక్వెస్ట్!

  • Published Feb 10, 2024 | 10:10 PMUpdated Feb 10, 2024 | 10:10 PM

భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా మీద ఆ ముద్ర వేయొద్దని అంటున్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. దయచేసి బుమ్రాను వదిలేయాలని కోరుకుంటున్నాడు.

భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా మీద ఆ ముద్ర వేయొద్దని అంటున్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. దయచేసి బుమ్రాను వదిలేయాలని కోరుకుంటున్నాడు.

  • Published Feb 10, 2024 | 10:10 PMUpdated Feb 10, 2024 | 10:10 PM
Jasprit Bumrah: బుమ్రా మీద ఆ ముద్ర వేయొద్దు.. టీమిండియా మాజీ కోచ్ రిక్వెస్ట్!

క్రికెటర్ల కెరీర్​లో గాయాలు కామనే. అయితే ఇంజ్యురీల వల్ల చాలా మంది ప్లేయర్లు ఫామ్ కోల్పోతారు. దీంతో మునుపటి రేంజ్​లో పెర్ఫార్మ్ చేయలేకపోతారు. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం గాయాల వల్ల దొరికిన టైమ్​ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. పునరావాసంలో ఉంటూ తమ టెక్నిక్​కు మెరుగులు దిద్దుకుంటారు. ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించి సరిదిద్దుకుంటారు. ఫిట్​నెస్​ను మరింత ఇంప్రూవ్ చేసుకొని గతంలో కంటే బాగా రాణిస్తారు. భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఇదే కోవలోకి వస్తాడు. గాయాల కారణంగా కొన్నాళ్లు టీమ్​కు దూరమైన బుమ్రా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 నుంచి ఇంగ్లండ్​తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ వరకు ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ దుమ్మురేపుతున్నాడు. అయితే బుమ్రాపై కొందరు కొన్ని ముద్రలు వేస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.

ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు బుమ్రా. టీ20, వన్డేలు, టెస్టులనే తేడా తేకుండా బ్యాటర్లతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్​ సిరీస్​లోనూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. డెడ్లీ యార్కర్లు, రివర్స్ స్వింగింగ్ డెలివరీస్​తో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. అలాంటోడిపై కొందరు వైట్ బాల్ స్పెషలిస్ట్ అనే ముద్ర వేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రవిశాస్త్రి వెల్లడించాడు. కానీ అది కరెక్ట్ కాదని.. అతడు అన్ని ఫార్మాట్లలోనూ సూపర్బ్​గా బౌలింగ్ చేయగలడని అన్నాడు. దయచేసి బుమ్రాను అలా వదిలేయాలని.. అతడిపై ఏ ముద్రా వేయొద్దని కోరాడు. ఎలాంటి పిచ్​ల మీదనైనా జట్టును గెలిపించే సత్తా జస్​ప్రీత్ సొంతమని రవిశాస్త్రి ప్రశంసల్లో ముంచెత్తాడు.

‘మొదటిసారి బుమ్రాతో మాట్లాడిన రోజు నాకింకా గుర్తుంది. టెస్టు క్రికెట్​ ఆడే ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అని అతడ్ని అడిగా. దానికి.. ‘అలాంటి ఛాన్స్ వస్తే నా లైఫ్​లో అదే అతిపెద్ద రోజుగా మిగిలిపోతుంది’ అని బుమ్రా అన్నాడు. అప్పటిదాకా అతడ్ని కేవలం వైట్ బాల్ స్పెషలిస్ట్​గానే చూశారు. బుమ్రాకు నచ్చకపోయినా ఆ ముద్ర వేసేశారు. కానీ అతడిలో వికెట్లు తీయాలనే కసి, పట్టుదల, ఆకలి ఉందని నాకు తెలుసు. దీంతో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉండాలని అతడికి చెప్పా. సౌతాఫ్రికా టూర్​కు తీసుకెళ్తానన్నా. బుమ్రా కూడా అరంగేట్ర మ్యాచ్​కు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీతో కలసి టెస్టులు ఆడాలనేది అతడి డ్రీమ్. లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లో వండర్స్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ అవేవీ గుర్తుండవు. అదే టెస్టుల్లో మాత్రం ఎలా ఆడారనేదే అభిమానులు చూస్తారు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి.. బుమ్రాపై ఎలాంటి ముద్ర వేయొద్దంటూ భారత మాజీ కోచ్ చేసిన సూచనలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ ఇంట్లో విషాదం.. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి