iDreamPost

స్టార్ క్రికెటర్ ఇంట్లో విషాదం.. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు..!

  • Published Feb 10, 2024 | 9:04 PMUpdated Feb 10, 2024 | 9:04 PM

ఒక స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు కాస్తా బాధలో మునిగిపోయాడు.

ఒక స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు కాస్తా బాధలో మునిగిపోయాడు.

  • Published Feb 10, 2024 | 9:04 PMUpdated Feb 10, 2024 | 9:04 PM
స్టార్ క్రికెటర్ ఇంట్లో విషాదం.. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు..!

గ్రౌండ్​లో తమ అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ అలరించే క్రికెటర్ల జీవితాల్లో కూడా ఎన్నో బాధలు ఉంటాయి. పైకి వాళ్లు సంతోషంగానే కనిపిస్తారు. కానీ పైకి చెప్పలేని కష్టాలు, కన్నీళ్ల కథలు వారి లైఫ్​లోనూ ఉంటాయి. సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నా, కోట్లాది రూపాయాల సంపాదన ఉన్నా.. వాళ్లూ సాధారణ మనుషులే. మనలాగే ఫ్యామిలీకి వాళ్లూ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. ఆ బాధ నుంచి బయటికొచ్చి మళ్లీ క్రికెట్ ఆడటం అంత ఈజీ కాదు. ఇప్పుడు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్​మన్ డెవాన్ కాన్వే పరిస్థితి అలాగే ఉంటుంది. కాన్వే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీని నుంచి అతడు ఇప్పట్లో బయటపడటం కష్టంగానే ఉంది.

పండంటి బిడ్డను ఎత్తుకుంటామని సంతోషంగా ఎదురుచూస్తున్న కాన్వే-కిమ్ దంపతులకు శోకమే మిగిలింది. ఈ ప్రపంచంలోకి రాకుండానే వారి పాపాయి తల్లి గర్భంలోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని కాన్వే సతీమణి కిమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘నా పర్సనల్ లైఫ్ గురించి అందరితో పంచుకునేందుకు అంతగా ఇష్టపడను. కానీ గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతో మంది మహిళలు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారో తెలుసు. అయినా, ఈ విషయాన్ని పంచుకునేందుకు నేనేమీ బాధపడటం లేదు. అలాగని సిగ్గుపడటమూ లేదు. ఎందుకంటే.. నాలాగే ఏ స్త్రీకైనా ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తే ఆమె హృదయం ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి కదా! అందుకే నా మనసులోని భావాలను అందరితో షేర్ చేస్తున్నా. ఏదో ఓ రోజు మా లైఫ్​లో తిరిగి అద్భుతం జరుగుతుంది. తను మళ్లీ వస్తే బోలెడంత ప్రేమను కురిపించేందుకు మేం రెడీగా ఉంటాం’ అని కిమ్ ఎమోషనల్ నోట్​ను షేర్ చేసింది.

కాన్వే భార్య నోట్ చూసిన అభిమానులు విచారం వ్యక్తం చేసుకున్నారు. పండంటి బిడ్డను ఎత్తుకుంటారని అనుకుంటే ఇలా అయిందేంటని బాధపడుతున్నారు. దీని నుంచి ఆ దంపతులు త్వరలోనే బయటపడాలని కోరుకుంటున్నారు. కాగా, చాన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న కాన్వే-కిమ్ 2020లో ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో 2022లో సౌతాఫ్రికాలో తమ సంప్రదాయ పద్ధతిలో మ్యారేజ్ చేసుకున్నారు. ఇక, న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లలో ఒకడైన కాన్వే ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​కు ఆడుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ గత సీజన్​లో సీఎస్​కే విన్నర్​గా నిలవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. 15 ఇన్నింగ్స్​ల్లో 672 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల లిస్టులో మూడో ప్లేసులో నిలిచాడు.

ఇదీ చదవండి: Prithvi Shaw: చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. ఏకైక భారత క్రికెటర్​గా అరుదైన రికార్డు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి