iDreamPost

కోహ్లీ కోసం అతడ్ని బలిపశువు చేస్తున్నారు.. రోహిత్​పై మాజీ క్రికెటర్ సీరియస్!

  • Published Jun 02, 2024 | 5:50 PMUpdated Jun 02, 2024 | 5:50 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ భారత మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. కావాలనే అతడ్ని పక్కనబెట్టారని.. ఇది అన్యాయమని అన్నాడు. కోహ్లీ కోసం అతడ్ని బలిపశువును చేస్తున్నారని ఫైర్ అయ్యాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ భారత మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. కావాలనే అతడ్ని పక్కనబెట్టారని.. ఇది అన్యాయమని అన్నాడు. కోహ్లీ కోసం అతడ్ని బలిపశువును చేస్తున్నారని ఫైర్ అయ్యాడు.

  • Published Jun 02, 2024 | 5:50 PMUpdated Jun 02, 2024 | 5:50 PM
కోహ్లీ కోసం అతడ్ని బలిపశువు చేస్తున్నారు.. రోహిత్​పై మాజీ క్రికెటర్ సీరియస్!

పొట్టి ప్రపంచ కప్-2023 ప్రిపరేషన్స్​ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. చాన్నాళ్ల కిందే యూఎస్​ఏ చేరుకొని సాధన మొదలుపెట్టిన రోహిత్ సేన.. నిన్న బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేసింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. 60 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. మెయిన్ మ్యాచెస్​లో మరింత కాన్ఫిడెన్స్​తో దిగనుంది. నిన్నటి మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్​లో చాలా మందిని పరీక్షించింది భారత్. 8 మంది బౌలింగ్ చేశారు. బ్యాటింగ్​లోనూ ఏడుగురికి ప్రాక్టీస్ దొరికింది. అయితే అంతా బాగానే ఉన్నా ఓ ప్లేయర్​ను ఆడించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బంగ్లాతో వార్మప్ మ్యాచ్​లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్​కు ఆడే అవకాశం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేశాడు. టీమిండియాలో ఓపెనింగ్ స్పాట్ కోసం జైస్వాల్, రోహిత్​తో పాటు విరాట్ కోహ్లీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ రీసెంట్​గా అమెరికా చేరుకోవడం, ప్రయాణంతో అలసిపోయాడని ఆడించలేదు. దీంతో జైస్వాల్​ను పక్కాగా ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ మాత్రం యంగ్ ప్లేయర్​ను కాదని శాంసన్​ను ఓపెనింగ్​లో దింపాడు. దీంతో మెయిన్ మ్యాచెస్​లో కోహ్లీతో కలసి తానే ఓపెనింగ్​కు రానున్నట్లు సిగ్నల్స్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సీరియస్ అయ్యాడు. కోహ్లీ కోసం జైస్వాల్​ను బలిపశువును చేస్తున్నారని అన్నాడు.

కోహ్లీ కోసం జైస్వాల్​ను బలిపశువును చేస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదంటూ రోహిత్​పై సీరియస్ అయ్యాడు మంజ్రేకర్. ఇలాంటి కొత్త టాలెంట్​ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. వార్మప్ మ్యాచ్​లో పక్కనబెట్టడం తప్పుడు సూచనలు ఇచ్చినట్లు అయిందన్నాడు. ‘నిన్నటి మ్యాచ్​లో దురదృష్టవశాత్తూ జైస్వాల్​ బెంచ్ మీదే కూర్చోవాల్సి వచ్చింది. ఒకవేళ నా చేతిలో పవర్ ఉంటే పూర్తిగా కొత్త టాలెంటెడ్ ప్లేయర్లతో మ్యాచ్​కు వెళ్లేవాడ్ని. ఎంతో ప్రతిభ కలిగిన జైస్వాల్ లాంటి యంగ్​స్టర్స్​కు అవకాశాలు ఇస్తే చెలరేగి ఆడతారు. అప్పుడు జట్టు కూర్పు వైవిధ్యంగా మారుతుంది. కానీ భారత్ మాత్రం సీరియర్లను నమ్ముకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆ ప్లాన్ బెడిసికొట్టింది’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. మరి.. వార్మప్ మ్యాచ్​లో జైస్వాల్​ను ఆడించకపోవడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి