iDreamPost

బంగ్లా మ్యాచ్​తో 5 విషయాలపై క్లారిటీ.. రోహిత్ అనుకున్నది సాధించాడు!

  • Published Jun 02, 2024 | 5:11 PMUpdated Jun 02, 2024 | 5:11 PM

టీ20 ప్రపంచ కప్-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్​తో నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్​తో కెప్టెన్ రోహిత్ 5 విషయాలపై క్లారిటీ తెచ్చుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్​తో నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్​తో కెప్టెన్ రోహిత్ 5 విషయాలపై క్లారిటీ తెచ్చుకున్నాడు.

  • Published Jun 02, 2024 | 5:11 PMUpdated Jun 02, 2024 | 5:11 PM
బంగ్లా మ్యాచ్​తో 5 విషయాలపై క్లారిటీ.. రోహిత్ అనుకున్నది సాధించాడు!

టీ20 వరల్డ్ కప్ సన్నాహకాలను టీమిండియా ఘనంగా ఆరంభించింది. యూఎస్​ఏ చేరిన వెంటనే సాధనలో మునిగిపోయిన రోహిత్ సేన.. నెట్స్​లో జోరుగా శ్రమించింది. అలాగే బంగ్లాదేశ్​తో న్యూయార్క్​ వేదికగా నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేసింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన బంగ్లా అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్​లో టీమిండియాకు ఎన్నో సానుకూల అంశాలు లభించాయి. మెయిన్ మ్యాచెస్ స్టార్ట్ అవడానికి ముందు ప్లేయింగ్ ఎలెవన్ మీద క్లారిటీ రావడానికి బంగ్లాతో పోరు ఎంతో ఉపయోగపడింది. ఈ మ్యాచ్​తో కెప్టెన్ రోహిత్ శర్మ అనుకున్నది సాధించాడు.

ఈసారి భారత జట్టులో ఒకే స్థానానికి రెండు లేదా మూడు ఆప్షన్స్ ఉండటంతో ఏ ప్లేస్​లో ఎవర్ని ఆడించాలనేది సమస్యగా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్, వికెట్ కీపర్, ఆల్​రౌండర్స్, సీమర్స్ విషయంలో ఎవర్ని ఆడించాలనే దానిపై సారథి రోహిత్ టెన్షన్ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాతో మ్యాచ్​తో అతడు అనుకున్నది సాధించాడు. ఈ మ్యాచ్​తో 5 విషయాలపై స్పష్టత వచ్చింది. అందులో మొదటిది ఓపెనర్​గా యశస్వి జైస్వాల్​ను పంపకపోవడం. ఈ మ్యాచ్​లో అతడ్ని ఆడించలేదు. దీంతో మెయిన్ మ్యాచెస్​లో జైస్వాల్​కు బదులుగా విరాట్ కోహ్లీతో కలసి ఓపెనింగ్​ చేయనున్నట్లు హిట్​మ్యాన్​ ఇన్​డైరెక్ట్​గా సిగ్నల్స్ పంపాడని అంటున్నారు. అయితే జైస్వాల్​ను కావాలనే దాస్తున్నాడా? సర్​ప్రైజ్ ప్యాకేజ్​గా దించుతాడా? అనే అనుమానం కూడా ఉంది. నిన్నటి మ్యాచ్​లో వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఫ్లాప్ అయ్యాడు. 6 బంతుల్లో ఒకే పరుగు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అదే టైమ్​లో మరో కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు.

32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 53 పరుగులు చేశాడు పంత్. వచ్చిన బాల్​ను వచ్చినట్లు స్టాండ్స్​కు తరలించడమే పనిగా అతడి బ్యాటింగ్ సాగింది. దీంతో వికెట్ కీపర్​గా ఎవర్ని తీసుకోవాలనే కన్​ఫ్యూజన్ తొలగిపోయింది. బంగ్లాతో మ్యాచ్​తో ఆల్​రౌండర్స్ విషయంలోనూ రోహిత్​కు క్లారిటీ వచ్చింది. శివమ్ దూబె బ్యాటింగ్​లో ఫెయిలైనా బౌలింగ్​లో 2 వికెట్లతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయడమే గాక బ్యాటింగ్​లో 40 పరుగులతో నాటౌట్​గా నిలిచి ఆకట్టుకున్నాడు. దీంతో వీళ్లిద్దరి ఫామ్, పెర్ఫార్మెన్స్​ మీద ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. మరో విషయం అర్ష్​దీప్ సింగ్ రాణించడం. ఈ పేసర్ 3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. స్వింగ్​తో బ్యాటర్లను భయపెట్టాడు. మరోవైపు సిరాజ్ 1 వికెట్ తీసినా అర్ష్​దీప్ రేంజ్​లో బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో బుమ్రాకు జతగా సెకండ్ పేసర్​గా అర్ష్​దీప్​ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి