Nidhan
టీమిండియాతో సూపర్ ఫైట్‌కు సిద్ధమవుతోంది ఆస్ట్రేలియా. ఈ తరుణంలో ఆ జట్టు పించ్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భారత స్టార్లా ఆడటం ఎవరి వల్లా కాదన్నాడు.
టీమిండియాతో సూపర్ ఫైట్‌కు సిద్ధమవుతోంది ఆస్ట్రేలియా. ఈ తరుణంలో ఆ జట్టు పించ్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భారత స్టార్లా ఆడటం ఎవరి వల్లా కాదన్నాడు.
Nidhan
రెండు కొదమసింహాలు తలపడితే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారా? ఓటమి ఒప్పుకోని యోధుల కొట్లాట గురించి ఎదురు చూస్తున్నారా? అయితే ఇంకొన్ని నిమిషాలు ఓపిక పడితే చాలు. టీ20 ప్రపంచ కప్‌లో ఆసక్తికర పోరాటానికి రంగం సిద్ధమైంది. హేమాహేమీలైన భారత్, ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో సంకుల సమరం మొదలవనుంది. సెమీస్ చేరాలంటే గెలుపు తప్ప ఇంకో ఆప్షన్ లేని కంగారూ జట్టు ఒకవైపు.. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమికి పగ తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన మరోవైపు. ఈ రెండు రెండు టీమ్స్ మధ్య ఇవాళ సూపర్ ఫైట్ జరగనుంది. ఇందులో గెలిస్తే ఆసీస్ సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే ఇంటికే. అదే భారత్ నెగ్గినా.. ఒకవేళ తక్కువ తేడాతో ఓడినా సెమీస్‌కు క్వాలిఫై అవుతుంది. అయితే రివేంజ్ తీర్చుకోవాలని కసిగా ఉన్న మెన్ ఇన్ బ్లూ.. కంగారూల పని పట్టాలని అనుకుంటోంది.
భారత్-ఆసీస్ ఫైట్ కోసం ఇరు దేశాలతో పాటు మొత్తం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టోర్నీలో ఈ రెండు బిగ్ టీమ్స్, అలాగే ఫేవరెట్స్ కూడా. స్టార్లతో నిండిన ఈ టీమ్స్ తలపడితే ఎవరు గెలుస్తారో పక్కా చెప్పలేని పరిస్థితి. తమ రేంజ్‌కు తగ్గట్లు ఆడితే వీళ్లను ఓడించడం ఎవరి వల్లా కాదు. అలాంటి ఇరు టీమ్స్ కలబడితే ఎలా ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయాలి. ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు, అనలిస్ట్‌లు, ఎక్స్పర్ట్స్ కూడా ఈ పోరాటం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో భారత జట్టు గురించి ఆసీస్ పించ్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా నిండా స్టార్లు ఉన్నారని.. కెప్టెన్ రోహిత్ శర్మే ఆ జట్టుకు కొండంత బలమని అన్నాడు. హిట్‌మ్యాన్ లాంటి బ్యాటర్‌ను ఎక్కడా చూడలేదని చెప్పాడు. అలా ఆడటం ఎవరి వల్లా కాదన్నాడు.
‘రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. అతడు ఆడుతుంటే జస్ట్ చూస్తూ ఉండిపోవాలంతే. అతడు బ్యాటింగ్ చేస్తుంటే ఎక్కడా ఏదో కష్టపడి షాట్లు కొట్టినట్లు అనిపించదు. ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఆడుతున్న భావన కలుగుతుంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే’ అని డేవిడ్ చెప్పుకొచ్చాడు. హిట్‌మ్యాన్ ఆడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనే ఫీలింగ్ కలగకమానదు అని తెలిపాడు. రోహిత్ గురించి డేవిడ్ మాట్లాడితే.. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్వెల్ కామెంట్ చేశాడు. కోహ్లీ తనను తాను మెరుగుపర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటాడని అన్నాడు. క్రికెట్లో అసాధ్యమనుకునే ఎన్నో విషయాలు విరాట్ అందుకున్నాడని ప్రశంసల్లో ముంచెత్తాడు మాక్సీ. అయితే ఇంత ఎత్తుకు ఎదిగినా ఇంకా తనను తాను బెటర్ చేసుకోవడానికి అతడు పరితపిస్తుండటం అద్భుతమని మెచ్చుకున్నాడు. మరి.. రోహిత్‌లా ఆడటం ఎవరి వల్లా కాదంటూ టిమ్ డేవిడ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Tim David said – “Rohit Sharma is naturally so good to watch. The way he plays so effortless and the way he bats, it’s like sit down watch him and such a joy to watch him bat”. (Star Sports). pic.twitter.com/czOZjFJKl3
— Tanuj Singh (@ImTanujSingh) June 24, 2024
Australian players talking about Virat Kohli. 🐐pic.twitter.com/DPQZ05zHnm
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2024